'నేనేమీ పోర్న్‌స్టార్‌ని కాను..'

రాఖీ సావంత్‌ ఈజ్‌ బ్యాక్‌. చాలా కాలం తర్వాత ఓ సినిమాలో కాస్త ప్రాధాన్యత వున్న పాత్రను దక్కించుకున్న బాలీవుడ్‌ ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌, ఆ సినిమాకి సెన్సార్‌ బోర్డ్‌ 'ఎ' సర్టిఫికెట్‌ ఇవ్వడంతో తెగ ఇదయిపోతోంది. గతంలో అయితే, రాఖీ సావంత్‌ తన సినిమాకి 'ఎ' సర్టిఫికెట్‌ రాకపోతే ఎలా.? అంటూ అమాయకంగా ప్రశ్నించేది. ఆ రాఖీ సావంత్‌ ఇప్పుడిలా మారిపోయిందేంటీ.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 

సన్నీలియోన్‌ వచ్చేశాక.. హీరోయిన్లే ఐటమ్‌ సాంగ్స్‌ చేసేస్తున్నాక.. రాఖీ సావంత్‌కి డిమాండ్‌ అమాంతం పడిపోయింది. పూనమ్‌ పాండే లాంటోళ్ళ పుణ్యమా అని, రాఖీ సావంత్‌ పనిగట్టుకుని ఎక్స్‌పోజింగ్‌ చేసినా పనిలేకుండా పోతోంది. అందుకే, ఆ మధ్య నరేంద్రమోడీ ఫొటోల్ని తన డ్రెస్‌ మీద ప్రింట్‌ వేయించేసుకుని, ఆ వెరైటీ డ్రెస్‌తో వార్తల్లోకెక్కింది. 

ఇదిగో, ఇప్పుడిలా తన తాజా చిత్రం 'ఏక్‌ కహానీ జూలీ కీ' విడుదలకు సిద్ధమయిన వేళ, ఆ సినిమాకి 'ఎ' సర్టిఫికెట్‌ని సెన్సార్‌ బోర్డ్‌ ఇవ్వడంతో గుస్సా అవుతూ మీడియాకెక్కింది. అన్యాయం, అక్రమం.. మేం డబ్బులివ్వలేదనే సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లానీ, 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారంటూ మండిపడింది. అంతేనా, తనకే ఆ సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ డిమాండ్‌ కూడా చేసేసింది. 

'నేనేమీ పోర్న్‌స్టార్‌ని కాదు.. నా సినిమాకి ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి' అంటూ ఈ సందర్భంగా రాఖీసావంత్‌ నిప్పులు చెరగడంతో, పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌కి చిర్రెత్తుకొచ్చిందట. మొదటి నుంచీ సన్నీలియోన్‌పై ఏదో ఒక రూపంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వుంది రాఖీసావంత్‌. 'ఎ' సర్టిఫికెట్‌ అంటే ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం. రాఖీసావంత్‌ చిర్రెత్తిపోవడానికి అలు అర్థమే లేదు. జస్ట్‌ ఇదో పబ్లిసిటీ స్టంట్‌ అంతే. Readmore!

Show comments