ఊహించని విధంగా వేడెక్కిన 'దసరా'

దసరా బరిలో ముందుగా రామ్ పోతినేని సినిమాను ప్రకటించారు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చేస్తున్న సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత చిన్న గ్యాప్ లో రవితేజ కూడా దసరాకు వస్తున్నట్టు ఎనౌన్స్ చేశాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా దసరాకు రాబోతోంది.

ఇలా రెండు పెద్ద సినిమాలు తమ తేదీల్ని ప్రకటించడంతో.. ఈ దసరా బాక్సాఫీస్ రామ్ వెర్సెస్ రవితేజ అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అంతలోనే ఊహించని విధంగా బాలయ్య సినిమా ప్రకటన వచ్చేసింది. అవును.. దసరా బరిలో బాలయ్య నిలిచాడు.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఈరోజు దసరా రిలీజ్ అంటూ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విజయదశమికి ఆయుధపూజ అనే పవర్ ఫుల్ క్యాప్షన్ కూడా తగిలించారు. దీంతో రామ్, రవితేజ, బాలయ్య మధ్య దసరా వార్ లాక్ అయినట్టయింది.

అయితే అసలు మేటర్ ఇది కాదు.. Readmore!

బాలయ్య సినిమా బరిలో ఉందని తెలిస్తే, బోయపాటి కచ్చితంగా రేసులోకి దిగడు. బాలయ్యపై బోయపాటికి ఉన్న అభిమానం అనుకోవచ్చు, వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అనుకోవచ్చు.. ఏదైనా వీళ్లిద్దరూ పోటీపడడం అనేది జరగని పని. సో.. బోయపాటి సినిమాను దసరాకు విడుదల చేస్తున్నారంటూ ప్రకటన వచ్చిన వెంటనే, బాలయ్య సినిమా దసరాకు రాదని అంతా ఫిక్స్ అయిపోయారు.

కానీ ఊహించని విధంగా బాలయ్య సినిమా కూడా దసరాకు వస్తోందనే ప్రకటన రావడంతో.. తెరవెనక ఏదో జరిగే ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. చాలామంది ఈ దసరా వార్ ను బాలయ్య వెర్సెస్ బోయపాటిగా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మొత్తానికి బాలకృష్ణ రాకతో దసరా బాక్సాఫీస్ వేడెక్కింది. రామ్, రవితేజ, బాలకృష్ణలో ఎవరు తగ్గుతారు? లేక ముగ్గురూ థియేటర్లలోకి వస్తారా? రోజులు గడిచేకొద్దీ ఈ మేటర్ పై క్లారిటీ వస్తుంది.

Show comments

Related Stories :