ఇది అధికార వాంఛ కాదు

"..తేదేపా శాశ్వతంగా అధికారంలో వుండాలి. అన్ని స్థానాలు గెలవాలి.. 80 శాతం ప్రజలు తేదేపాకే ఓట్లు వేయాలి. ఓడిపోకుండా ‘అన్ని జాగ్రత్తలు’ తీసుకుంటున్నా. మా ప్రభుత్వమే శాశ్వతంగా వుంటుంది.."

ఇలా అనడం బాబు అనుకూల మీడియాకు ఆత్మవిశ్వాసం మాదిరిగా కనిపించవచ్చు. తప్పు లేదు. అదే వాస్తవం అని కూడా అనుకోవచ్చు. కానీ సమస్య ఒక్కటే. ఇదే విధంగా ప్రతిపక్ష నాయకుడు, మేం గెలుస్తాం.. మేం అధికారంలోకి వస్తాం.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. అంటే మాత్రం ఎందుకు ఎద్దేవా చేస్తాయో అర్థం కాదు. అది అధికారం వాంఛగా, అధికారం కోసం యావగా ఎందుకు కనిపిస్తాయో? అత్తకు ఓ రూలు, కోడలికి ఓ రూలు అన్నట్లుగా లేదూ?

Show comments