హీరో కన్నా హీరోయిన్ రెమ్యూనరేషనే ఎక్కువ!

అసలే ఆమె బాగా సంపాదిస్తున్న హాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడుతోంది. ప్రపంచ స్థాయిలో సంపాదనపరులైన హాలీవుడ్ హీరోయిన్ల సాటిగా నిలుస్తోంది. ఆమె స్థాయికి ఇప్పుడు బాలీవుడ్ హీరోలే చిన్నబోతున్నారు. ఏకంగా హీరోలకు మించిన స్థాయి పారితోషకం అందుకుంటోంది. ఇదంతా దీపికా పదుకునే సంగతి. 

సంజయ్ లీలా భన్సాలీ “పద్మావతి’’ సినిమాకు గానూ దీపిక రికార్డు స్థాయి పారితోషకం తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ సినిమాకు దీపిక పదకొండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పొందుతోందని సమాచారం. ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న రణ్ వీర్ సింగ్ కు ఇంత డబ్బు ఇవ్వడం లేదట! అతడి రేంజ్ పది కోట్ల లోపలే.

ఈ విధంగా దీపిక లీడింగ్ లో ఉన్న హీరోకి మించిన స్థాయి లో పారితోషకం పొందుతోంది. ఇది వరకూ ఒక సినిమాకు అమితాబ్  తో కలిసి నటించి ఆయన కన్నా ఎక్కువ పారితోషకం పొందిందామె.

Show comments