స్ట్రగులింగ్‌ మెగా బ్రదర్స్‌

ఒక టైమ్‌లో వరుస విజయాలతో కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ షేక్‌ చేసిన మెగా బ్రదర్స్‌ సూర్య, కార్తి ప్రస్తుతం స్ట్రగుల్‌ అవుతున్నారు. వీరి సినిమాలన్నీ నిరాదరణకి గురవుతున్నాయి. ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్‌ ఆదరిస్తారనేది అర్థం కాక అన్నదమ్ములిద్దరూ తలలు పట్టుకున్నారు.

సూర్య 24లాంటి విభిన్నమైన చిత్రం చేసినా, సింగం-3తో మాస్‌ మసాలా దట్టించినా ఫలితం లేకపోయింది. కార్తీ చిత్రాలకి కూడా ఓపెనింగ్స్‌ రావడం లేదు. తమిళ రంగంలోకి దూసుకొచ్చిన శివ కార్తికేయన్‌ లాంటి వారికి గ్యారెంటీ ఓపెనింగ్స్‌ వస్తోంటే ఎస్టాబ్లిష్‌ అయిన కార్తీ, సూర్యలకి మాత్రం చెప్పుకోతగ్గ వసూళ్లు రావడం లేదు. ఒక మూమెంట్‌లో సూర్య తమిళ ఇండస్ట్రీకి నెక్స్‌ట్‌ సూపర్‌స్టార్‌ అవుతాడని అనుకున్నారు. 

కార్తీ కూడా వరుస విజయాలతో అన్నకి తగ్గ తమ్ముడనిపించాడు. కానీ సీన్‌ రివర్స్‌ అవడంతో భవిష్యత్‌ ప్రణాళికపై బ్రదర్స్‌ ఇద్దరూ కసరత్తు చేస్తున్నారు. తెలుగులో ఇద్దరికీ మార్కెట్‌ వుండడంతో తెలుగు స్టార్‌ డైరెక్టర్స్‌తో కలిసి వర్క్‌ చేస్తే అటు తమిళం, ఇటు తెలుగు రెండిట్లో గ్యారెంటీ పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ తెలుగు హీరోలని కాదని వీళ్ల కోసం మన స్టార్‌ డైరెక్టర్లు కదిలేదెప్పుడు?

Show comments