ధోనీ బయోపిక్ లో ఈ హీరోయిన్ ప్రస్తావన?

ఈ నెలాఖరులో విడుదల కానుంది మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్. దీన్ని కేవలం హిందీలో మాత్రమే కాకుండా.. తెలుగు, తమిళం వంటి భాషల్లోకి డబ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ధోనీకి ఉన్న బీభత్సమైన క్రేజ్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించగలదనే నమ్మకం ఏర్పడుతోంది. రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమాకు గట్టిగానే వసూళ్లు ఉండే అవకాశం ఉంది.

ఈ సంగతిలా ఉంటే.. వాస్తవానికి దగ్గరగా ఉంటుందని ధోనీ స్వయంగా చెప్పిన ఈ సినిమా కథనం ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ధోనీ ఎదిగి వచ్చిన తీరు, కుటుంబం, చదువు, క్రికెట్ లో తొలి అడుగు, ఆటగాడిగా ఎదుర్కొన్న అనుభవాలు, కెప్టెన గా రాణింపు తదితరాల మిళితం అయిన ఈ సినిమాలో ఒక హీరోయిన్ ప్రస్తావన ఉంటుందా? లేదా ? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

ఇలా ధోనీ బయోపిక్ లో ప్రస్తావన గురించిన వార్తల్లో ఉన్నది మరెవరో కాదు లక్ష్మీ రాయ్. పలు తెలుగు సినిమాల్లో నటించిన రాయ్ ప్రధానంగా తమిళంలో నటించింది. అదే సమయంలో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ తరహాలో వ్యవహరించింది.  ఆ సమయంలో రాయ్ కి, ధోనీకి సాన్నిహిత్యం మొదలైందని ప్రచారం జరిగింది.  వీళ్లిద్దరి మధ్య నా ఎఫైర్ ఉందని, వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయం పై వీరిద్దరూ పెదవి విప్పలేదు.మరి సినిమాలో అయినా.. వాస్తవవాలు ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.

ఆల్రెడీ ఈ సినిమాలో ధోనీ భార్య  గురించే కాకుండా.. వివాహానికి పూర్వపు గర్ల్ ఫ్రెండ్ ఒకమ్మాయి ప్రస్తావన కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మరి లక్ష్మీ రాయ్ తో వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తావన ఉంటుందేమో!

Show comments