పవన్ సినిమాలో ఇంద్రజ

ఒకప్పటి హీరోయిన్, ఇప్పుడు అడపా దడపా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఇంద్రజకు మరో మంచి చాన్స్ వరించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న హారిక హాసిని వారి సినిమాలో కీలక పాత్రకు ఇంద్రజను తీసుకోవాలని యోచిస్తున్నారు.

తండ్రి మరణంపై రివెంజ్ తీర్చుకునే స్టోరీలో కీలకపాత్రలు ఒకటి రెండు వున్నాయి. అందులో ఒకటి సవతి తల్లి పాత్ర. అది ఒకప్పటి హీరోయిన్ కుష్ బూ చేస్తున్నారు. సవతి తల్లి, కొడుకు కలిసి రివెంజ్ తీర్చుకుంటారు.

అయితే ఇదే కథలో ఇంకో కీలక పాత్ర కూడా వుందట. దానికి ఇంద్రజను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఆమెను సంప్రదించారు. డేట్లు, వగైరా అన్నీ ఒకె అయితే ఇంద్రజకు మాంచి చాన్స్ దొరికేస్తుంది.

అత్తారింటికి దారేది సినిమాతో నదియాను బిజీగా మార్చేసారు త్రివిక్రమ్. ఇప్పుడు ఇంద్రజకు కూడా అలాంటి అవకాశం తలుపు తట్టేలా వుంది. దసరాకు విడుదల చేసినా, చేయకున్నా, ప్రొడక్ట్ మాత్రం రెడీ అయిపోవాలనే పట్టుదలతో ఈ సినిమాను చకచకా షూట్ చేస్తున్నారు.

Show comments