బాహుబలి వన్ కు వచ్చినంత బజ్ బాహుబలి 2 కి ఇప్పటికైతే రాలేదు. టెక్నికల్ గా ఎన్నో మాట్లాడుతున్నారు..ఇప్పటికి ఏవోవో విడుదల చేసారు. అయినా కూడా బజ్ అన్నదే లేదు. కానీ శివరాత్రి సందర్భంగా ఒక్క స్టిల్ విడుదల చేసేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇది కదా లుక్..ఇది కదా పోస్టర్..ఇది కదా రాజమౌళి స్టయిల్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
భారీ ఏనుగు తొండం మీద హీరో ప్రభాస్ మాంచి రాజసమైన ఫోజ్ ఇవ్వడంతో ఇదంతా సాధ్యమైంది. ఇప్పటికైనా రాజమౌళికి తెలియాలి. ఈ విఆర్ ఎఫెక్ట్ లు, టెక్నాలజీలు అవన్నీ ఎక్కడైనా పనికి వస్తాయేమో కానీ, తెలుగునాట కాదు. ఇక్కడ జనాలకు కళ్ల ముందు బొమ్మ కనిపించాలి.
అది కూడా హీరోచితంగా వుండాలి. అప్పుడే ఎక్కడలేని బజ్ వస్తుంది. ఏప్రిల్ లోగా ఇలాంటి స్టిల్స్, టీజర్లు, ఎన్ని పడితే అంత బజ్. సూక్ష్మం రాజమౌళికి తెలియంది కాదు. ఇక ఆ దిశగానే వెళ్లేటట్లుంది బాహుబలి 2 ప్రచారం.