‘గౌతమి పుత్రశతకర్ణి’ సినిమా విషయంలో అంతా అలా కలిసి వచ్చిందని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా చేయడం తన అదృష్టం అని, ఈ అదృష్టం విషయంలో క్రిష్ తనకు ఒక అనుసంధాన కర్త అని.. బాలయ్య అన్నారు. ఈ సినిమాను కేవలం 79 రోజుల్లోనే పూర్తి చేశాం.. ఇంత వేగవంతంగా సినిమా పూర్తి కావడంలో ఏదో అతీత శక్తి తమకు సహకరించిందని బాలయ్య వ్యాఖ్యానించారు. ఆద్యంతం ఆ శక్తి ప్రభావం చూపించిందన్నారు.
క్రిష్ ను ఏదో అతీత శక్తి తన వద్దకు పంపిందని, సినిమా పూర్తి కావడంలో కూడా ఆ శక్తి సహకరించిందని.. ఫస్ట్ కాపీ చూశాకా తను అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యానని బాలకృష్ణ అన్నారు. సంక్రాంతికి ఇతర సినిమాలతో ఉన్న పోటీ గురించి మాట్లాడుతూ.. ఈ పోటీ ఆరోగ్యకరమైనదని అన్నారు. పోటీ వాతావరణం మంచిదని బాలయ్య అన్నారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
తన తదుపరి సినిమాలకు కూడా వైవిధ్య భరితమైన కాన్సెప్టులనే ఎంచుకుంటానని బాలయ్య అన్నారు. జనరేషన్ మారింది, ప్రేక్షకుల అభిరుచి మారింది.. అందుకు తగ్గట్టుగా సినిమాలు చేస్తానన్నాడు.