చరణ్ సినిమా శాటిలైట్ 16 కోట్లు?

రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లోని రంగస్థలం 1985 సినిమా శాటిలైట్ బేరాలు స్టార్ట్ అయ్యాయి. చాలా పెద్ద రేటే పలికినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టాయ. 16 కోట్లకు శాటిలైట్ రైట్స్ ఫిక్స్ అయ్యాయని, ఇంకా అగ్రిమెంట్ మాత్రం కాలేదని తెలుస్తోంది.

రామ్ చరణ్ సినిమాకు 16 కోట్లు అంటే అది చాలా పెద్ద మొత్తమే. అయితే సుకుమార్ డైరక్టర్ కావడం, గ్రామీణ నేఫథ్యంలో, డిఫరెంట్ మూవీగా తయారు చేస్తుండడంతో ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే రంగస్థలం 1985 సినిమాకు ఖర్చు కాస్త భారీగానే అవుతోందని తెలుస్తోంది. రెమ్యూనిరేషన్ పార్ట్ కూడా భారీగానే వుంది. సుకుమార్, రామ్ చరణ్, సమంత, దేవీ శ్రీ ప్రసాద్ ఇలా కాస్తా భారీ ఖర్చే.

అందుకే సినిమాకు 70 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు మైత్రీ మూవీస్ మాత్రం చాలా ధీమాగా వున్నారు. ఈ సినిమా సుకుమార్ కెరీర్ లోనే ది బెస్ట్ అవుతుందని, అంత గోప్ప సబ్జెక్ట్ అని అంటున్నారు. అన్నీ తెలియాలంటే మరి కొంత కాలం ఆగాలి.

Show comments