మోడీజీ.. ఇవి చవకబారు వ్యూహాలు కాదా?

లాటరీ.. మోసానికి ఒక పర్యాయపదం. జనాలకు ఆశపెట్టి వాళ్ల నుంచి డబ్బులు గుంజడం, తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి వ్యాపారస్తులు లక్కీ డ్రాలనే లాటరీలను అనుసరిస్తూ ఉండటం పరమ రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. డైరెక్టుగా లాటరీ టికెట్లు అమ్మడం ఒక తరహా మోసం..దీన్ని దేశంలో చాలా రాష్ట్రాలు నిషేధించాయి. 

ఇక వంటింటి గిన్నెలు, ప్లేట్లను అమ్ముకునే వారితో మొదలు.. ఫ్రిడ్జ్ లు టీవీలు అమ్ముకునే వారి వరకూ.. పండగల సందర్భంగా లాటరీలు నిర్వహిస్తూ ఉంటారు. తమ దగ్గర వస్తువులను కొనాలని, ఒక టోకెన్ ఇస్తామని, దాంట్లోంచి లక్కీ కస్టమర్ ను ఎంపిక చేసి.. వాళ్లకు కార్లు, ఖరీదైన వస్తువులు గిఫ్టులుగా ఇస్తామని ప్రకటించి ఊరిస్తూ ఉంటారు.

ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, జనాలను ఆకర్షించి వ్యాపారాలను పెంచుకునే మార్గం.. కారిచ్చినా, బైకిచ్చినా.. అంతిమంగా ఇదొక ట్రాప్. జనాలకు దేన్నో చూపించి ఆకులు నాకించే వ్యూహం ఇది. 

మరి దీన్ని దురదృష్టం అనాలో.. కామెడీ అనాలో దేశాన్ని డిజిటలైజీకరణ చేయడానికి ఈ చవకబారు ఆలోచననే అనుసరిస్తున్నారు శ్రీమాన్ నరేంద్రమోడీ. ఇప్పటికే దేశాన్ని డిజిటలైజీకరణ చేయడానికి నోట్ల రద్దు అనే బృహత్తర ఆలోచన చేసిన మోడీజీ.. ఇప్పుడు ఈ లాటరీల వైపుకు వెళ్లారు. యాప్ ఇన్ స్టాల్ చేసుకోండి..దాన్నుంచి లావాదేవీలు చేయండి, పదివేల రూపాయల గిఫ్టులు గెలవండి..అంటూ మోడీజీ ప్రకటించారు.

మోడీ మాస్టర్ బ్రెయిన్ కు ఇలాంటి ఆలోచనలు వస్తుండటం దేశానికి పట్టిన దురదృష్టం అనుకోవాల్సి వస్తోంది. ఆఖరికి పాత సామాన్లు అమ్ముకునే వారి వ్యూహాలను అమలు చేస్తూ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నేటి తరానికి బాగా ఇష్టుడైన ప్రధానిగా పేర్గాంచిన మోడీజీ ఇలాంటి బృహత్తర పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ  ఆలోచనకు మళ్లీ అంబేద్కర్ సెంటిమెంటును కూడా యాడ్ చేశారు! అంబేద్కర్ ఏమైనా లాటరీలను, లక్కీ డ్రాలను నమ్ముకున్నారా? మొత్తానికి దేశం ఆ విధంగా ముందుకు వెళ్తోందనమాట!

Show comments