జగన్ భలే స్టెప్ వేసాడే

ప్రత్యర్థుల ఎత్తుగడలు ముందే గ్రహించి, అడుగు ముందుకు వేసేవాడే రాజకీయం బాగా నేర్చుకున్నవాడు అవుతాడు. ఇలా చూసుకుంటే వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ కు రాజకీయం బాగానే వంట బట్టినట్లుంది. ఈ సారి బడ్జెట్ లో నిరుద్యోగులకు భృతి ఇచ్చే ఆలోచనను రాష్ట్రప్రభుత్వం చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయమే.కానీ మూడేళ్లుగా దాన్ని గాలికి వదిలేసారు.

ఇప్పుడు జనాల్లో తెలుగుదేశం పట్ల కాస్త అసంతృప్తి పెరుగుతోంది, పైగా ఎన్నికలు రెండేళ్ల దూరంలోకి వస్తున్నాయి కాబట్టి ఇక ఏదో ఒకటి చేయాలి. బాబుగారికి తెలిసింది ఒకటే జనాల్ని డబ్బులతో కొట్టడం. అందుకే నిరుద్యోగ భృతి అస్త్రాన్నిబయటకు తీస్తున్నారని వినికిడి.

ఈ విషయం తెలిసి వైఎస్ జగన్ ముందుగానే మేల్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కోన్నట్లుగా నిరుద్యోగ భృతిని ప్రకటించాలంటూ ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాసారు. మేనిపెస్టోలో పేర్కొన్నట్లు నిరుద్యోగ భృతి ప్రకటించాలని, అంతే కాదు, నిరుద్యోగికి రెండు వేల వంతున ఈ మూడేళ్లకు బకాయిలు పడింది కూడా చెల్లించాలని అంటూ లెక్కలు కట్టారు. 

ఇప్పుడు ఇది చంద్రబాబుకు కాస్త ఇరకాటమే. నిరుద్యోగ భృతిని బడ్జెట్ కన్నా ముందుగానే జనాలకు గుర్తు చేసాడు వైఎస్ జగన్. బడ్జెట్ లో అది ప్రవేశ పెడితే, తమ డిమాండ్ నేరవేర్చారని వైకాపా ప్రచారం చేసుకోవచ్చు. అలా అని మానేయలేదు తెలుగుదేశం పార్టీ. అయితే జగన్ ఎంత రాజకీయం నేర్చుకున్నా, ఎన్ని ఎత్తులు వేసినా, బాబకు వున్న మీడియా పక్క వాయిద్యాల ముందు మాత్రం నిలబడలేడు. కేవలం ప్రజల్లో మార్పు వస్తే తప్ప.

Show comments