దిల్ రాజు కొరిక నెరవేరుతుందా?

ఓ పెద్ద సినిమా తీయాలని చాన్నాళ్లుగా కిందా మీదా అవుతున్నారు నిర్మాత దిల్ రాజు. ఏ పెద్ద హీరో కూడా సెట్ కావడం లేదు. గతంలో తను ఎక్కువగా అసోసియేట్ అయిన అల్లుఅర్జున్ తోనే తన కోరిక నెరవేరాలని అనుకుని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. తన ఆస్థాన దర్శకుడు లాంటి హరీష్ శంకర్ ను వెంటేసుకుని, బన్నీతో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అది కాస్త మొగ్గ తొడుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

బన్నీ విదేశీయాత్ర ముగించుకు వచ్చారు. హరీష్ శంకర్ రావాల్సి వుంది. మరి ఇక ఇప్పుడు బంతి బన్నీ కొర్టులోనే వుంది. దిల్ రాజుకు నిర్మాతగా ఓ ఫ్రాజెక్టు ఇస్తారా ? సరైన డైరక్టర్, సబ్జెక్ట్ దొరికితే అది దిల్ రాజుకు బదిలీ చేస్తారా? లేక హరీష్ శంకర్ ఆశ కూడా నెరవేరుస్తారా అన్నది చూడాలి. 

ఎందుకంటే ఇప్పటికి ఇంకా లింగు స్వామి సబ్జెక్ట్ చెప్పడం, బన్నీ ఓకె చేయడం అన్నది జరగలేదు. అది ఇంకా వార్తల్లోనే వుంది. మరి ఇంకెవరు అన్నది వెదుకులాటలోనే వుంది.  విదేశాలకు వెళ్లే ముందు పవర్ బాబీ తో సహా పలువురు డైరక్టర్లను బన్నీ కలిసి డిస్కస్ చేసాడు. వీళ్లలో ఎవరైనా ఏ సబ్జెక్ట్ అయినా ఓకే చేయించుకోక పోతే, మరి ఏ డైరక్టర్ దొరక్కపొతే దిల్ రాజు ఛాయిస్ నే నెరవేరుతుందేమో?

Show comments