ప్రియాంక: నా కాళ్ల తో కోట్ల వ్యాపారం జరుగుతోంది!

తన కాళ్లను మోడల్ గా చూపుతూ 12 నుంచి 15 బ్రాండ్లు అమ్మకాలు సాగిస్తున్నాయని అంటోంది మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో, క్వాంటికో వంటి షోలతో బిజీగా ఉన్న ప్రియాంక మోడలింగ్ లో తనకున్న డిమాండ్ గురించి, తన పేరుకున్న బ్రాండ్ ఇమేజ్ గురించి ఆసక్తికరమైన రీతిలో వివరించింది.

వివిధ రకాల  సౌందర్యోపకరణాలు, బ్రాండెడ్ దుస్తులు, షూలు, చెప్పులు, నెయిల్ పాలిష్ లు.. ఇలా కేవలం తన కాళ్ల ను మోడల్ గా చూపుతూ అన్ని బ్రాండ్లు అమ్మకాలు సాగిస్తున్నాయని ప్రియాంక వ్యాఖ్యానించింది. ఇదంతా కొసరు వ్యాపారమే!

చిన్నప్పుడు అందం మీద, శరీరాన్ని సుకుమారంగా చూసుకోవడం మీద ధ్యాస ఉండేది కాదని, కింద పడటంతో అనేక సార్లు మోకాళ్లకు గాయాలు కూడా అయ్యాయని.. శరీరాన్ని సుకుమారంగా చూసుకోవాల్సిన అవసరం ఏమిటో ఆ తర్వాత అర్థం అయ్యిందని ఆమె వివరించింది.

టీనేజ్ లో టామ్ బాయ్ లా తిరిగిన తన కాళ్లు అప్పుడు అందంగా ఉండేవి కాదని, గీరుకుపోయి కనిపించేవని చెప్పింది. శరీరాన్ని కాపాడుకోవడంపై స్వతహాగా వచ్చిన అవగాహనతో తన కాళ్లు ప్రపంచంలోనే ప్రెటీయెస్ట్ అయ్యాయంది. ఇప్పుడు వాటి మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని గమ్మత్తుగా వివరించింది. తనకు తాను బెస్ట్ వెర్షన్ గా మారానని ప్రియాంక చెప్పింది. దానికి కొన్ని సంవత్సరాలు పట్టాయంది.

Show comments