నిఖిల్ కష్టాల సినిమా

మంచి సినిమా సెట్ అయితే సరిపోదు..మంచి టైమ్ లో ఫినిష్ అయి, మంచి టైమ్ లో విడుదల కావాలి. అది మాత్రం టైమ్ మీదే ఆధారపడి వుంటుందేమో? పాపం, నిఖిల్ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా పరిస్థితి ఇలాంటిదే. శంకరాభరణం లాంటి విఫలయత్నం తరువాత ఈ మంచి ప్రాజెక్టు దొరికింది నిఖిల్ కు. టైగర్ లాంటి మీడియం హిట్ సినిమా అందించిన సబ్జెక్ట్ బాగుండడంతో టేకప్ చేసాడు. కొత్త నిర్మాత రంగంలోకి వచ్చారు. సినిమా మొదలైంది. 

హీరోయిన్లు వీళ్లు అనుకుని, వాళ్లు అనుకుని, ఆలస్యంగా. ఆఖరికి నివేథా థామస్, అవిక గౌర్, హెబ్బా పటేల్ లాంటి యంగ్ హీరోయిన్లు ముగ్గురు సెట్ అయ్యారు. కానీ సినిమా నిర్మాణంలో అడుగడుగునా ఏవో ఒక అడ్డంకి వస్తూనే వుంది. హీరోయిన్ల డేట్ల సమస్య, షూటింగ్ సమస్య, ఫైనాన్స్ సమస్య, ఇలా ఒకదాని తరువాత ఒకటి. ఆఖరికి కొద్ది రోజుల షూటింగ్ వుంది అని చిక్ మంగుళూరు వెళ్తే, కావేరీ జలాల సమస్య. మూడు రోజులు షూటింగ్ బకాయి వుండగానే వెనక్కు రావాల్సి వచ్చింది.

దీనికి తోడు నిర్మాతకు డైరక్టర్ కు సింక్ కావడం లేదని వినికిడి. ఇప్పుడు మూడు రోజులు హెబ్బా పటేల్ తో వర్క్ వుంది. దానికి ఓ కేవ్ కావాలి. దాని కోసం విదేశాలకు వెళ్ధాం అంటారు హీరో, డైరక్టర్. ఇక నా వల్ల కాదు, ఇప్పటికే ఖర్చు ఎనిమిది కోట్లు దాటేసింది..ఇక్కడే ఎక్కడో తీసుకోండి అంటారు నిర్మాత. ఈలోగా ఈ సీన్ లో పాల్గొనాల్సిన హెబ్బా అవుట్ డోర్ కు వెళ్లిపోయింది వేరే సినిమా కోసం. ఇంకేముంది..మళ్లీ గ్యాప్.

నిర్మాత ఓవర్ బడ్జెట్ చేసేసారని అంటున్నట్లు టాక్. చిక్ మంగుళూరు కు వెళ్లి, అక్కడ సెట్ కోసం పాతిక మందికి పైకా కార్పెంటర్లను తీసుకెళ్లారట. దీంతో అక్కడ ఖర్చు తడిసి మోపెడయ్యిందని వినికిడి. ఇప్పుడు మూడు రోజుల కేవ్ వర్క్ కోసం విదేశాలకు అంటే మళ్లీ నా వల్ల కాదని నిర్మాత అంటున్నట్లు తెలుస్తోంది.

మంచి ప్రాజెక్టు..మంచి కథ, బాగా వస్తోందని ఇన్ సైడ్ టాక్. కానీ ఏం లాభం, ఇన్ టైమ్ లో రెడీ చేసుకుని, విడుదల చేసుకోకపోతే. పైగా శంకరాభరణం వచ్చి డిసెంబర్ కు ఏడాది పూర్తవుతుంది. ఓ మీడియం రేంజ్ హీరో అంటే ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలి కదా? 

Show comments