తగ్గిన స్టిల్స్ ఎక్కడ రోహిత్?

నారా రోహిత్..ఫిజిక్ సమస్యతో బాధపడుతున్నహీరోల్లో ఒకరు. అయితే తుంటరి..సావిత్రి లాంటి సినిమాల ఫలితం తరువాత, ఫిజికల్ గా సైజ్ తగ్గాలి అని డిసైడ్ అయ్యాడు. ట్రయినర్ ను పెట్టుకుని మరీ కష్టపడ్డాడు. మరీ భయంకరంగా తగ్గకపోయినా, కొంతవరకు చేంజ్ వచ్చిందని వినికిడి. ఇప్పుడు ఆ కొత్త లుక్ తో కథలో రాజకుమారి షూట్ లో పాల్గొంటున్నాడు. అయితే ఇంకా పాత స్టిల్స్ నే పీఆర్వోలు పంపించడంతో పాపం, ఇంకా నారా రోహిత్ అలాగే వున్నాడంటూ వార్తలు వెలువడ్డాయి. ఇది చూసి రోహిత్ ఖంగుతిన్నాడని వినికిడి. అర్జెంట్ గా కొత్త ఫొటోలు విడుదల చేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది. 

నమిత ప్రమోద్‌ నాయికగా నటిస్తున్న కథలో రాజకుమారి, సినిమాతో మహేష్‌ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శిరువూరి రాజేష్‌వర్మ సమర్పణలో మాగ్నస్‌ సినీప్రైమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై 'కార్తికేయ' శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 27 నుండి జూలై 15 వరకు జరిగే షెడ్యూల్‌తో మూడు సాంగ్స్‌, టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. 

ఆగస్ట్‌లో జరిగే చివరి షెడ్యూల్‌లో బ్యాలెన్స్‌ మూడు పాటలను చిత్రీకరిస్తారు. నారా రోహిత్‌, నమిత ప్రమోద్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ళ భరణి, అజయ్‌, ప్రభాస్‌ శ్రీను, స్వామిరారా సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయేష్‌ నాయర్‌, సంగీతం: ఇళయరాజా, పాటలు: కృష్ణచైతన్య, రామజోగయ్య శాస్త్రి, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, కళ: సాహి సురేష్‌, సహనిర్మాత: బీరం సుధాకర్‌ రెడ్డి, సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ, నిర్మాత: కార్తీకేయ శ్రీనివాస్‌, దర్శకత్వం: మహేష్‌ సూరపనేని.

Show comments