బోయపాటి సినిమా మరింత వెనక్కు?

బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా రెడీ కావడానికే చాలా టైమ్ పట్టింది. ఏనాటి ఫ్రాజెక్టు అలా అలా నడచి, చేతులు మారి, ఆఖరికి టాకీ పూర్తయింది. ఇంకా సాంగ్స్ బాకీ వున్నాయి.

ఈ సినిమా విడుదల మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం సినిమాకు అనుకున్న రేటు రావకపోవడమే అని అంటున్నారు. వాస్తవానికి బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడు ఓ డిజాస్టర్ సినిమా. దాని వల్ల నిర్మాతలు కాస్త గట్టిగానే నష్టపోయారు.

కానీ ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం రేట్లు కాస్త గట్టిగా చెబుతున్నారని వినికిడి. ఈ రేట్లు దర్శకుడు బోయపాటి రేంజ్ లో వున్నాయని తెలుస్తోంది. దానికి బయ్యర్లు ఓకె అనడం లేదని, హీరోను బట్టి రేటు వుండాలని వెనకు ముందు ఆడుతున్నారని తెలుస్తోంది.

దీంతో ముందు టీజర్లు, ట్రయిలర్లు విడుదల చేసి, సినిమాకు కాస్త హైప్ తీసుకువచ్చి, ఆ తరువాత మార్కెటింగ్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు, అందువల్ల ఓ నెల వెనక్కు వెళ్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా వుంటే ఈ సినిమా వర్క్ ఇంకా వుండగానే శ్రీవాస్ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సినిమా స్టార్ట్ చేసారు. స్టార్ట్ కాకుండానే నిర్మాత మారారు.

ఇప్పుడు ఒకద్దరు ప్రొడక్షన్ టీమ్ ల విషయంలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన ఫాదర్ సురేష్ వేరే పేర్లు రికమెండ్ చేస్తున్నట్లు వినికిడి.  అక్కడ డిస్కషన్లు సాగుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

Show comments