థర్టీ ఇయర్స్ పృధ్వీ ఆవేదన మెగాస్టార్ అర్థం చేసుకున్నారు. పృధ్వీ వున్న ఒక సీన్ ను కలిపేయమని చెప్పేసారు. ఆ మేరకు సీన్ కలిపేసారు. రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చే సీన్ లో మంత్రిగా పృధ్వీ, ఆయన పిఎ గా దువ్వాసి మోహన్ కనిపిస్తారు. ఇది మరి కొన్ని సీన్లు సినిమా ఎడిటింగ్ లో ఎగిరిపోయాయి. ఈ వైనంపై పృధ్వీ కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యారు.
మీడియాలో కాస్త హడావుడి జరిగింది. ఇదంతా మెగాస్టార్ దృష్టికి రావడంతో, తోటి నటుడు ఆవేదన, అభిమానం అర్థం చేసుకుని, బాధపడకుండా ఒకసీన్ అయినా వుండేలా చూడమని దర్శకుడు వివి వినాయక్ కు చెప్పారట. దాంతో ఒక సీన్ జోడించినట్లు తెలుస్తోంది. మరి ఇక ఇప్పుడు పృధ్వీ ఫుల్ హ్యాపీ అనుకోవాలి.