(జై) లవకుశ లోగో వచ్చింది

ఎన్టీఆర్-బాబీ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా జై లవకుశ. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు అలనాటి పౌరాణిక క్లాసిక్, శంకర్ రెడ్డి నిర్మించిన ఎన్టీఆర్ తొలి రంగుల సినిమా లవకుశ పేరుకు జై అనే పదాన్ని జోడించి టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ లోగోను శ్రీరామ నవమి సందర్భంగా విడుదలచేసారు.

లవకుశ టైటిల్, శ్రీరామ నవమి సందర్భం, తారకరామారావు హీరో అన్నీ బాగా సెట్ అయ్యాయి. లోగో కూడా అలనాటి లవకుశ లోగోనే దాదాపు అలాగే వాడారు. జై అన్న అక్షరాన్ని అలాగే డిజైన్ చేసారు. 

మొత్తానికి ఎన్టీఆర్ తన తరువాతి సినిమా మీద చాలా గట్టి శ్రద్ధతోనే వున్నట్లు కనిపిస్తోంది. లోగో లాంచింగ్, అది కూడా శ్రీరామనవమి నాడు, ఆ లుక్, అన్నింట్లో ఆ జాగ్రత్త కనిపిస్తోంది.

Readmore!
Show comments

Related Stories :