వ్యవహారం వెంకయ్య చేతుల్లో లేదా?

కేంద్రంలో వ్యవహారాలు ఏవీ మంత్రి వెంకయ్య నాయుడు కంట్రోల్ లో లేనట్లు కనిపిస్తోంది. గతంలో భాజపా కేంద్రంలో అధికారంలో వున్నపుడు దక్షిణాది వ్యవహారాలన్నీ వెంకయ్య నాయుడు కావాలనుకున్నట్లు నడిచేవి. కానీ మోడీ హయాంలో అలాంటి సీన్ వున్నట్లు కనిపించడం లేదు. అంత సీన్ వుంటే హోదానే సాధ్యమయ్యేది. మోడీని ఎంత భుజాన మోస్తున్నా, వెంకయ్య జోక్యం కేంద్రం నిర్ణయాల్లో చాలా తక్కువని, అసలు ఆయన ప్రభావితం చేయడం అన్నది లేనే లేదని రాజకీయ వర్గాల బోగట్టా.

 వెంకయ్య నాయుడికే పట్టు వుంటే, తమిళనాడు సిఎస్ రామ్మోహనరావు ఇంటి మీద ఐటి దాడి జరిగేదే కాదని టాక్ వినిపిస్తోంది.  ఎందుకంటే రామ్మోహనరావు ఎవరొ కాదు. దివంగత ఆదికేశవులు నాయుడి సోదరుడికి స్వయానా వియ్యంకుడు . ఆదికేశవులు నాయుడు అంటే తెలుగుదేశంలో కింగ్ పిన్. తెలుగు దేశం జనాలతో ఆయనకు ఎంత సాన్నహిత్యం వుందన్న సంగతి రాజకీయ వర్గాలకు అందరికీ తెలిసిందే. ఆయన బతికి వుండగా కేవలం తెలుగుదేశం జనాలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సాయం చేసేవారు. పివి నరసింహరావు టైమ్ లో ఆయనతో సన్నిహితుడిగా మెలిగారు. లక్ష్మీ పార్వతి కొడుకు మెడిసిన్ చదివింది, ఆ తరువాత ఉద్యోగం చేస్తున్నది ఆదికేశవులు నాయుడు కాలేజీలోనే. ఆయన తరువాత ఆయన భార్య తెలుగుదేశం ఎంపీ అయ్యారు.

మరి ఐటి కన్ను ఇటు ఆదికేశవులు నాయుడు కుటుంబం మీద, బంధువుల మీద పదే పదే పడుతోంది అంటే, ఏమనుకోవాలి? పరిస్థితుల వెంకయ్య నాయుడి కంట్రొలు లో లేవనే అనుకోవాలి. చంద్రబాబు ఏరి కోరి నియమించిన టీటీడీ మెంబర్ శేఖర రెడ్డి వ్యవహారం పరువు తీయకముందే ఆదికేశవులు నాయడు భార్య, తెలుగు దేశం ఎమ్మెల్యే ఆస్తులపై ఐటి దాడి జరిగింది. అయితే తెలుగుదేశం అనుకూల మీడియా దాన్ని వీలయినంత లైట్ చేసింది. అది జరిగిన ఇన్నాళ్లకు అదే కుటుంబానికి చెందిన రామ్మోహనరావు ఇంటి మీద దాడి జరిగింది. అక్కడితో ఆగకుండా రామ్మోహనరావుతో సంబంధం వున్న ఆదికేశవులు నాయడు  బంధు గణంపై కూడా ఐటి దాడి జరిగింది.

ఇవన్నీ వెంకయ్య నాయుడుకు ఏమాత్రం తెలిసి జరిగినవి కాదనే రాజకీయ వర్గాల బోగట్టా. మోడీ, అమిత్ షా రేంజ్ లో జరుగుతున్న రాజకీయాలకు వెంకయ్యకు నడుమ చాలా దూరం వున్నట్లు తెలుస్తొంది. నిజానికి వెంకయ్య నాయుడికి కనుక ఫుల్ హోల్డ్ వుండి వుంటే చంద్రబాబు ఎప్పుడో ఆయన ద్వారా జగన్ కేసులను కిందా మీదా చేసి వుండేవారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే, మోడీ వ్యవహారాలు ఇప్పుడు కాకున్నా రేపయినా, కాస్త తెలుగుదేశం మెడకు చుట్టుకునేలాగే కనిపిస్తున్నాయి. బహుశా అందుకే కావచ్చు..ఇప్పటి నుంచే భాజపాను బద్ నామ్ చేసే పని మిత్రుడు పవన్ భుజాలపై వుంచినట్లుంది ?

కొసమెరుపు ఏమిటంటే..సాధారణంగా జగన్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయినవాడి చుట్టానికి సంబంధించి ఏమైనా జరిగితే, జగన్ తో లింక్ పెట్టేసే బాబు అనుకూల మీడియా రామ్మోహనరావు బంధుత్వాలపై మాత్రం చాలా శాంతం వహించింది. 

Show comments