నయీమ్.. ఒక్క మెట్టూ దాటి ఉంటే..!

నయీమ్.. ఎన్ కౌంటర్ కు గురి అయ్యేంత వరకూ చాలా తక్కువ మందికే పరిచయం ఉన్న పేరు ఇది. అతడితో డీలింగ్స్ జరిపిన రాజకీయ నేతలకు, పోలీసులకు, అతడి బాధితులకు..తప్ప ఈ తరంలో పెద్దగా పరిచయం లేని వ్యక్తే అతడు. బెల్లీ లలిత జరిగింది అప్పుడెప్పుడో.. ఇక ఒక టీఆర్ఎస్ నేత హత్య , పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య ఈ మధ్యకాలాల్లో జరిగినవే అయినా.. వీటి గురించి సీరియస్ ఇన్విస్టిగేషన్ లేదు.పటోళ్లను సుల్తాన్ బజార్ లో చంపి వెళ్లిపోయినా.. అంత నడిబొడ్డున పట్టపగలు హత్యజరిగినా.. దానిపై మీడియా కానీ, పోలీసులు కానీ మరీ సీరియస్ గా స్పందించిందిలేదు. ఎవరి వాటాలు వారికి అందాయి కాబోలు. ఇక పటోళ్ల ఏమీ గాంధేయవాది కాదుకాబట్టి.. అతడిని ఎవరు చంపారు, ఎందుకకు చంపారు అనే ఆసక్తి జనాలకు లేకుండాపోయింది.

కాబట్టి ఈ హత్యలు నయీమే చేయించాడు అని ఇప్పుడు చెబితేనే ఆ వ్యవహారం జనాలనోటీస్ లోకి వస్తోంది. నయీమ్ మరణించిన నేఫథ్యంలో అతడి వ్యవహారాలు ఒక్కొక్కటిగాబయటకు వస్తున్నాయి. అయితే ఇందులో కూడా చాలా షరతులున్నాయి! నయీమ్ తో సహవాసంచేసిన రాజకీయ నేతలకు, పోలీసు ఉన్నతాధికారులకు నొప్పి కలగని రీతిలో ఈవ్యవహారంపై విచారణ సాగుతోంది అనడానికి ఏమీ సందేహించనక్కర్లేదు. నయీమ్ తోసాన్నిహిత్యంగా మెలిగింది తెలుగుదేశం వాళ్లు అయినా.. తెరాస ప్రభుత్వం వాళ్లనురోడ్డు మీదకు లాగదు. నయీమ్ తో కోట్లకొద్దీ లంచాలు తిన్న పోలీసుల పోస్టులేమీపోవు!

ఈ విషయంలో అధికారంలో ఉన్నవారికినిజాయితీ ఉంటుంది. శత్రువులను మిత్రులుగాచేసుకోవడానికి.. అందరినీ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి అధికారంలో ఉన్నవారికి ఇలాంటి ఉదంతాలు కలిసొచ్చే అంశాలు మాత్రమే. ఏదో నయీమ్ చచ్చాడు.. వాడివెనుక ఉన్న వ్యవహారాలన్నీ వెలికి తీద్దాం.. అతడి ఆక్రమాస్తులను జాతీయంచేద్దామని విప్రనారాయణులెవరూ లేరిక్కడ.

ఈ సంగతిలా ఉంటే.. నయీమ్ అక్రమాల గురించి , అండర్ వరల్డ్ నుంచి ఇతడు సాగించినదందాల గురించి ఏనాడు రాయని మీడియా ఇప్పడు మాత్రం నయీమ్ గురించిపుంఖానుపుంఖాలుగా రాసుకొస్తోంది. అందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నయీమ్తదుపరి లక్ష్యం రాజకీయం అనేది!

వచ్చే ఎన్నికల నాటికి నల్లగొండ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నుంచిఎమ్మెల్యేగా పోటీచేయాలనేది నయీమ్ ప్రణాళిక అని మీడియా చెబుతోంది. అందులోభాగంగానే అతడురాజకీయ నేతలకు హెచ్చరికలు జారీ చేసే వరకూ వచ్చేశాడని.. అన్నీకుదిరి ఉంటే, ఒక రాజకీయ పార్టీ తరపున నుంచి వచ్చే ఎన్నికల్లో నయీమ్ పోటీ చేసేవాడని స్పష్టం అవుతోంది!

మరి అదే జరిగి ఉంటే.. నయీమ్ రేపటి ఎన్నికల్లో ఏదైనా పార్టీ తరపున పోటీ చేసిఉంటే.. అతడికి ఉన్న రౌడీయిజం బలానికి, డబ్బు కు పార్టీ టికెట్ సంపాదించడంకానీ, గెలవడం కానీ ఏమాత్రం సమస్య అయ్యేది కాదు! అదొక్కడీ జరిగి ఉంటే.. నయీమ్ప్రజాప్రతినిధి, ప్రజాస్వామ్యానికి ఒక పిల్లర్ అయ్యేవాడు! ఇంకేముంది.. అతడిఅక్రమాలు అన్నీ సక్రమాలు అయ్యేవి! అతడు ఇది వరకూ సాగించిన దందాలన్నీన్యాయబద్ధం అయిపోయేవి! వేల కోట్ల ఆస్తులన్నీ సక్రమం అయిపోయేవి!

రేపటి ఎన్నికల్లో అతడు పోటీ చేస్తే గెలిచేవాడు.. గెలిస్తే.. అప్పుడు మీడియాకూడా నయీమ్ సక్సెస్ స్టోరీలు రాసుకొచ్చేది. విప్లవకారుడు, నక్సలైట్ గా ప్రజలతరపున పోరాడాడు, పోలీస్ ఇన్ఫార్మర్ గా దేశానికి సేవ చేశాడు.. సామాజికసేవచేస్తూ.. రాజకీయాల్లోకి వచ్చాడు.. ప్రజామోదం పొంది ప్రజా ప్రతినిధి అయ్యాడు..అంటూ పడికట్టు పదాలతో మీడియా పొగిడేసేది! ఒక్కసారి ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనోఅయ్యుంటే.. ఆ తర్వాత ఈ వ్యవస్థ.. నయీమ్ భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలదాష్టీకాల విషయంలో ఈ వ్యవస్థ పీకగలిగి ఉండేదేమో లేదు! అయితే ఆ అవకాశంలేకపోయింది.. నయీమ్ ఇంతలోనే చచ్చాడు. ప్రజాస్వామ్యం ఒక సేవకుడి నికోల్పోయింది పాపం! ఈ కేటగిరిల్లో నయీమ్ దురదృష్టవంతుడు. ఎందుకంటే.. ఇతడిలాదందాలు చేసి ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసి రాజకీయాలు అయిన వాళ్లు కళ్లముందేతిరుగుతున్నారు. మంత్రులుగా వర్ధిళ్లుతున్నారు. రౌడీయిజం మెట్టును దాటిరాజకీయనేతలు అయిన ఎంతోమందికి ఉన్న అదృష్టం.. నయీమ్ కు లేని అవకాశం అదొక్కటే!

Show comments