పంజాబ్ లో పాగా వీళ్లదేనా..!

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసినట్టుగానే కనిపిస్తోంది. త్రిముఖ పోరులో పై చేయి కేజ్రీ పార్టీదే అని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడి చేయడానికి వీలు లేదని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడి కావడం లేదు కానీ.. పోలింగ్ తర్వాత కామన్ మ్యాన్ అభిప్రాయం అంటూ ఫలితాల గురించి ఊహాగానాలను వెల్లడిస్తున్నాయి మీడియా సంస్థలు. వీటి ప్రకారం చూస్తే.. పంజాబ్ లో ఆప్ కనీసం అరవై సీట్లు సాధిస్తుందనే మాట వినిపిస్తోంది!

సామాన్య ప్రజానీకం నుంచి ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఆప్ అరవై సీట్ల వరకూ నెగ్గుతుందని, కాంగ్రెస్ నలభై సీట్లతో నిలబడగలదని, బీజేపీ-అకాళీ కూటమి మాత్రం చిత్తు చిత్తే  అని పంజాబ్ కామన్ మ్యాన్ అభిప్రాయపడుతున్నాడని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆప్ కు దక్కే సీట్ల సంఖ్య మరింతగా పెరగవచ్చు అని కూడా ఈ వర్గాలు చెబుతుండటం విశేషం. 

మరి పంజాబ్ లో ఆప్ గనుక జయకేతనం ఎగరేస్తే.. అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలినట్టే. ఇప్పటికే ఢీల్లీ నుంచి ఈ రెండు పార్టీలను తరిమింది ఆప్. ఇప్పుడు పంజాబ్ లో కూడా పాగా వేసిందంటే… తదుపరి గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ హవా మొదలవ్వొచ్చు. పంజాబ్ లో  విజయం సాధిస్తే అది ఆప్ కు ఊపునిచ్చే ఉత్ప్రేరకం అవుతుంది. 

Show comments