ఘాజీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్?

ఘాజీ సినిమా విడుదల దగ్గర పడుతోంది. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది. ఈ సినిమా అటు హిందీ, ఇటు తెలుగు భాషల్లో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఘాజీ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మరి తెలుగు ట్రయిలర్ సంగతి? ఆ రేంజ్ స్టార్, వాయిస్ ఎవరు? ఏదీ? ఇందుకోసం ఘాజీ నిర్మాత పివిపి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు ఘాజీ ట్రయిలర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుందని తెలుస్తుంది. తెలుగులో మంచి పట్టు, పైగా మంచి స్వరం వున్న ఎన్టీఆర్ వాయిస్ఓవర్ అన్నది పక్కా ఫిట్ అనడంలో సందేహం లేదు. ఘాజీ సినిమా ఫిబ్రవరిలో జనం ముందుకు వస్తుంది.

Show comments