ప్రగ్య జైస్వాల్..మనోజ్ తో

కంచె సినిమాతో సినిమా జనాల కళ్ల ముందు జిగేల్ న మెరిసిన హీరోయిన్ ప్రగ్య జైస్వాల్. అంతకు ముందు మోడల్ గానే తెలుసు జనాలకు. కంచె తరువాత వెంటనే చకచకా సినిమాలు సైన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒకటీ ఒకటీ ఓకె చేసేస్తోంది. అలా లేటెస్ట్ గా ఓకె చేసిన సినిమా సత్య డైరక్షన్ లోని మనోజ్ సినిమా కూడా. 

ఇన్నాళ్లు ఈ సినిమాలో హీరోయిన్ ప్రగ్యయేనా? కాదా? అన్న డిస్కషన్ల నడిచాయి. ఆఖరికి ఆమెనే ఫైనల్ అయింది. పూరి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సత్య ఈ సినిమాను అవుట్ & అవుట్ యాక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో ప్రగ్య కు కూడా కాస్త లెంగ్త్, స్కోప్ వున్న పాత్రేనట.ప్రస్తుతం మంచు మనోజ్ శ్రీలంక నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు. 

Show comments