అక్టోబర్ కు ఫిక్సయిన పవర్?

పెద్దగా షెడ్యూల్ గాడి తప్పకుండా చకచకా షూటింగ్ జరిపేసుకుంటోంది పవన్ కళ్యాణ్- డైరక్టర్ త్రివిక్రమ్ సినిమా. ఈ సినిమా విడుదల డేట్ విషయంలోనే ఇంకా క్లారిటీ రావడం లేదు.

దసరాకు రావాలని వుంది. కానీ మహష్, బాలయ్యల సినిమా వుంది. అవి పక్కా అయితే, పవన్ సినిమాకు డేట్ సమస్య వస్తుంది. అటు సంక్రాంతికి రామ్ చరణ్-సుకుమార్ డేట్ లు ఫిక్స్ చేసుకున్నారు. దాంతో ఆల్టర్ నేట్ డేట్ కోసం చూస్తున్నారట ఈ సినిమా కోసం.

అక్టోబర్ 12 లేదా 13 తేదీలు అయితే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 19 దీపావళి. ఆ రోజు గురువారం. అందువల్ల 12 లేదా 13 విడుదల చేస్తే, రెండు వీకెండ్ లు కలిసి వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పవర్ స్టార్ అభిమానులు కూడా ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటే హిట్ గ్యారంటీ అని, అందువల్ల 2017లో పవన్ హిట్ సినిమా ఒకటి వుంటుందని, కాటమరాయుడు పరాజయం మరిచిపోవచ్చని అభిమానుల ఆశ.

ఇపుడు ఆ దిశగానే త్రివిక్రమ్ సినిమా యూనిట్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య ఈ డేట్ సర్క్యులేట్ కావడం మొదలయింది. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ల్లో వరుసగా పెద్ద సినిమాల పండగలే అన్నమాట.

Show comments