ఈ మంత్రిని తొలగిస్తే అడిగేవారుండరేమో!

దీపావళి అయిపోయినట్టే.. మరి ఇప్పుడైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా.. అని ఆశవహులు ఎదురుచూస్తున్నారు. అలాగే తొలగింపుల అంశం కూడా చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాల నుంచి వినిపిస్తున్న మాటల్లో ఒకటి.. రాయలసీమకు చెందిన ఒక మంత్రిని తొలగింపు ఖాయం అనేది! మరి ఎవరా అని ఆరా తీస్తే.. ఆ పేరు పల్లె రఘునాథ రెడ్డి అని ఆఫ్ ద రికార్డుగా ఆ మీడియాలోనే చెబుతున్నారు. 

మొన్నటి వరకూ రఘునాథ రెడ్డికి శాఖల కత్తిరింపు ఒకటే ఉంటుందనుకుంటే.. ఆయనను తొలగించడం ఖాయం అని ప్రభుత్వ గుట్లూముట్లూ ఎరిగిన మీడియా చెబుతోంది!

మరి ఏమిటి? అసలు మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ గురించి ఎలాంటి క్లారిటీ లేకుండానే.. పల్లెను తొలగిస్తారు, ఆయనను తీసేయడం ఖాయం.. అని ఎలా అంటారు? ఆయన అంత తప్పేం చేశాడు? అంటే.. సమాధానాలు ఏమీ లేవు! తొలగిస్తారంతే!

ఈ నేపథ్యంలో అర్థం చేసుకోదగిన అంశం ఏమిటంటే.. పల్లెను తొలగిస్తే అడిగే వారు ఎవరూ ఉండరు! రాయలసీమ కే చెందిన ఒక మంత్రికి కనీసం ఓనమాలు రావని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.. సదరు మంత్రి సమర్థత మీద బోలెడన్ని విమర్శలున్నాయి. అయితే వారిని తొలగించారు. ఒక కులానికి ఆరాధ్యనీయ స్థానంలో ఉండటమే దానికి కారణం.

ఇలా ఎవరికి వాళ్ల సేఫ్టీలున్నాయి. అయితే పల్లెను తొలగిస్తే.. ఈ కులం అసంతృప్తికి గురవుతుందేమో అనే బాధ లేదు. మరో సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తుందేమో అనే.. కథ లేదు. ఒక లాబీ అడ్డుపడుతుందేమో అనేదీ లేదు! ఎన్నో దశాబ్దాల పాటు పల్లె తెలుగుదేశంలో పని చేసినా.. సీనియర్ అయినా ఆయనను తొలగిస్తే ఎవ్వరూ మట్లాడే పరిస్థితి లేకపోవడంతోనే.. ఆయన పదవికి ఇప్పుడు ముప్పు వస్తున్నట్టుంది!

Show comments