డ్రగ్స్ కేసులో ఫుల్ క్లారిటీ

మొత్తానికి డ్రగ్స్ కేసును పరిశోధిస్తున్న ఉన్నతాధికారులు మీడియాలో వస్తున్న రకరకాల సందేహాలకు పూర్తి క్లారిటీ ఇచ్చేసారు. వారు ఇచ్చిన వివరణ ఈ విధంగా వుంది.

ఎక్సయిజ్ శాఖకు ఈ కేసు పరిశోధనకు పూర్తి అధికారాలు వున్నాయి. 2016 జూన్ లోనే ఈ మేరకు ప్రభుత్వం జీవో ఇచ్చింది.

సమర్ధులైన అధికారులు వున్నారు. వరల్డ్ బెస్ట్ ఇంటారగేషన్ మెథడ్స్ వాడుతున్నాము.

కేవలం సినిమా రంగాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నామన్నది అబద్ధం.

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకునే వారి పేర్లు బయట పెట్టడంలేదు. మీ పిల్లలో, మా పిల్లలో వుంటే అలా బయటపెట్టడం మంచిదేనా? ఎవరైనా సరే పిల్లల పేర్లు మాత్రం బయటపెట్టము.

ప్రతి నిమషం ప్రారంభం నుంచి, చివరి వరకు వీడియోగ్రఫీ చేసి సీల్ చేసి వుంచాము. అదే కోర్టుకు కూడా ఇస్తాము. ఈ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తున్నాము.

కొనడం, అమ్మడం మాత్రమేకాదు, వాడడం, ఎప్పుడో గతంలో వాడడం, ఇంట్లో వాళ్లు వాడడం, ఇలా ఏదయినా నేరమే. ఆ సంగతి తెలుసుకోవాలి క్లియర్ గా.

విచారణ సమయంలో, వాళ్లను అడిగి, వాళ్లు సమ్మతించిన తరువాతే శాంపిల్స్ తీసుకుంటున్నాము. బలవంతంగా ఒప్పించడంలేదు. వీడియో ఫుటేజ్ లు వున్నాయి.

ఇక విచారణపై మీడియాకు సమాచారం అందించడం కోసం ఇద్దరు అధికారులను నియమించాం. ఇకపై ఏమయినా వారే చెబుతారు.

కేస్ డైరీ చూడకుండా, తెలియకుండా, ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు. కేసులు నిలవవు అంటున్నారు. ఇండియా ఫేమస్ లాయర్ అయినా కేసు డైరీ చూడకుండా ఏ విషయం చెప్పలేరు.

ఏం జరుగుతూందో, విచారణలో ఏం తెలుస్తోందో తెలియకుండా, ఎవరికి వాళ్లు చర్చల్లో కూర్చుని జడ్జిమెంట్ లు పాస్ చేసేయడం కరెక్ట్ కాదు. 

ఇంక ఎంత మందిని అరెస్ట్ చేస్తాము, లేదా ఎంతమందిని విచారిస్తాం అనేది కేసు పురోగతిని బట్టి వుంటుంది.

Show comments