టాలీవుఢ్ లో డైరక్టర్ల కొరత భయంకరంగా వుంది. చిన్న డైరక్టర్లు, పెద్ద డైరక్టర్లు అన్న తేడా లేదు. కాస్త విషయం వుండి, ప్రూవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సినిమా చేతిలో వుంది. కాస్త క్రేజ్ వున్న దర్శకులతయితే చెప్పనక్కరే లేదు రెండు మూడు ప్రాజెక్టులు పైప్ లైన్ లో వున్నాయి. ఇలాంటి పీక్ సీజన్ లో కూడా కొంతమంది దర్శకులు కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారో, లేదో తెలియని పరిస్థితిలో వుండిపోయారు.
డిక్టేటర్ లాంటి మీడియం హిట్ ఇచ్చిన శ్రీవాస్ జనవరి నుంచి అలా ఖాళీగానే వుండిపోయారు. పిల్లా నువ్వులేని జీవితం తరువాత సౌఖ్యం లాంటి సినిమా అందించిన రవికుమార్ చౌదరి కూడా ఖాళీగానే వున్నట్లు కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ తో సినిమా అన్నారు కానీ, అది లేదని తెలిపోయింది.
స్పీడున్నోడు సినిమా తరువాత భీమినేని శ్రీనివాసరావుకు చేతిలో సినిమా లేదు.శ్రీకాంత్ అడ్డాల, దశరథ, ప్రవీణ్ సత్తారు, శ్రీనివాసరెడ్డి, దేవా కట్టా ఇలా చాలా మంది డైరక్టర్లు ఫ్లాపులు ఇస్తే ఇచ్చి వుండొచ్చు కానీ, గతంలో కాస్త ప్రూవ్ చేసుకున్నవారే. మరి వీరెవరి జోలికి చిన్న , మీడియం హీరోలు, నిర్మాతలు కూడా ఎందుకు వెళ్లడం లేదో?