భారీ సినిమాగా వైశాఖం

సాధారణంగా కొత్త నటులతో సినిమా తీయాలంటే సేఫ్ జోన్ లో మూడు నుంచి నాలుగుకోట్ల మధ్యలో తీస్తారు. కానీ తమ బ్యానర్ ను, తమ డైరక్టర్ ను నమ్మి రిచ్ లుక్ వుండే మంచి సినిమాను అందించాలని ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత బిఎ రాజు చెప్పారు. అందువల్ల ఈ సినిమాకు నటీనటుల రేంజ్ తో చూసుకుంటే కాస్త భారీగానే ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.  

డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం నాలుగో షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈనెల 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్‌ని, ఓ పాటని చిత్రీకరిస్తారు. వైశాఖం సినిమా రిచ్ గా, కలర్ ఫుల్ గా వుండడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కజకిస్థాన్ లాంటి డిఫరెంట్ ప్లేస్ లో పాటలు చిత్రీకరించారు. దీనికోసం కాస్త భారీగానే ఖర్చుచేయాల్సి వచ్చింది. 

సినిమా గురించి దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ - ''లవ్‌లీ' తర్వాత మళ్ళీ సూపర్‌హిట్‌ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా 'వైశాఖం'. ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసే మంచి సినిమాగా 'వైశాఖం' రూపొందుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ మిక్స్‌ అయిన 'వైశాఖం' అపార్ట్‌మెంట్స్‌ నేపథ్యంలో సాగుతుందని అన్నారు. 

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ.. ఇవన్నీ హిట్‌ అయి బయ్యర్స్‌కి లాభాల్ని అందించాయి. అందుకే బయ్యర్స్‌ ఈ సినిమా మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే నిర్మాతగా నా చిత్రాలకు చేసే పబ్లిసిటీ పెద్ద స్థాయిలో వుంటుందన్న నమ్మకంతో బిజినెస్‌పరంగా చాలా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. 

ఇది చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో తీస్తున్న 'వైశాఖం' మా బేనర్‌లో వచ్చిన 'లవ్‌లీ'కి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌ నుండి కూడా బిజినెస్‌ పరంగా మంచి ఆఫర్స్‌ రావడం హ్యాపీగా వుంది. ఆగస్ట్‌లో జరిగే అయిదో షెడ్యూల్‌తో దాదాపుగా చిత్రం పూర్తవుతుంది'' అన్నారు. హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో  సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. 

Show comments