రామ్ చరణ్ బ్రదర్ ఎవరు?

చరణ్ బ్రదర్ నా? అంటే వరుణ్ తేజ్ వున్నాడుగా అనేయవచ్చు. కానీ ఇక్కడ విషయం అది కాదు. సుకుమార్ డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమాలో హీరో రామ్ చరణ్ బ్రదర్ క్యారెక్టర్ ఒకటి వుంది. అది కూడా కాస్త ప్రాధాన్యత వున్నదే. ఈ క్యారెక్టర్ కోసమే వైభవ్ రెడ్డిని తీసుకునే ఆలోచన చేసారు. అది తెలియక చాలా మంది విలన్ గా వైభవ్ రెడ్డి అనుకున్నారు. విలన్ కాదు. హీరో కన్నా జస్ట్ వన్ టు టూ ఇయర్స్ పెద్ద అయిన బ్రదర్ పాత్ర.

అయితే ఇప్పుడు ఈ పాత్ర కు మరో పేరు కూడా పరిశీలిస్తున్నారు. బన్నీ సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టి. అయితే ఆది పినిశెట్టి ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో ఒకటి చేస్తున్నాడు.  కానీ సుకుమార్ కు బల్క్ డేట్ లు కావాలి.

ఈ విషయమై చర్చలు సాగుతున్నాయి. డేట్లు దొరికితే ఆది పినిశెట్టి. లేదూ అంటే వైభవ్ రెడ్డి. సుకుమార్ సినిమాలో చరణ్ బ్రదర్ గా కనిపిస్తారు. అదీ విషయం.

Readmore!
Show comments

Related Stories :