ముద్దులకు, బికినీకీ ఓకే.. కానీ, అలా వద్దు!

తెరపై ముద్దు సీన్లలో నటించడానికి ఏమీ అభ్యంతరం లేదు, అలాగే బికినీ.. అది టూపీస్ అయినా.. వన్ పీస్ అయినా ఓకే.. ఇలా కనిపించడానికి, నటించడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఎటొచ్చీ.. న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా. నగ్నంగా నటించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. అని అంటోంది సయేషా సైగల్. తెలుగు వారికి ‘అఖిల్’ సినిమాతో పరిచయం ఉన్న ఈ భామ ఇటీవల ‘శివాయ్’ తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో తెరపై అగుపించడానికి సంబంధించి తన అభిప్రాయాలను చెప్పింది. ముద్దు సీన్ల పట్ల, స్విమ్ సూట్ పట్ల ఈ భామకు అభ్యంతరాలు ఏమీ లేవట. నగ్నత్వం మీద మాత్రమే అభ్యంతరమట. 

మరి బాలీవుడ్ ఏస్థాయికి ఎదిగిపోయిందో కూడా ఈమె మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకూ బికినీ లో నటించడానికి ఓకే అని కొంతమంది, నో అని కొంతమంది హీరోయిన్లు అనే వాళ్లు. పత్రికల్లో అందుకు సంబంధించిన వార్తలే వచ్చేవి. ఇక ముద్దు సీన్లలో నటించడం గురించి హీరోయిన్ల సమ్మతి, అభ్యంతరాలు పెద్ద పెద్ద శీర్షికలతో అచ్చు అయ్యాయి. వాటికి ఓకే అని కొంతమంది, నో అని మరికొందరు చెప్పేవాళ్లు.

ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పే వచ్చింది.. ముద్దు సీన్లు, బికినీలు అంటే.. హీరోయిన్లు కూడా వాటి గురించి ఆలోచించేది ఏమీ లేదు, ఓకే అనేస్తారు.ఇప్పుడు అభ్యంతరం అంతా.. నగ్నంగా కనిపించడం మీద! చాలా ఎదిగిపోయింది భారతీయ సినిమా. ఈ మధ్య కాలంలో కొంతమంది పేరున్న నటీమణులు అన్ని విప్పేసి తెరపై కనిపించే సరికి.. నిర్లజ్జ గా నగ్నంగా కనిపించే సరికి.. మిగతా హీరోయిన్లు కూడా ‘అలా కనిపించడం’ పై ఏదో ఒక అభిప్రాయం చెప్పాల్సి వస్తోంది.

మరి గత పది, పదిహేనేళ్లలోనే బికినీ- లిప్ లాక్ లు చాలా కామన్ అయ్యాయి. అలా కనిపించడానికి, అలా నటించడానికి ఇప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. మరి ఇప్పుడు నగ్నంగా కనిపించడం గురించి ఈ హీరోయిన్ల సన్నాయి నొక్కుళ్లు చూస్తూ ఉంటే.. రానున్న కాలంలో.. తెరపై విశృంఖలమే అనుకోవాల్సి వస్తోంది!

Show comments