బీజేపీలోకి వైసీపీ విలీనం.. ఎన్నోసారి?

అంతే.. ఆయనకు ఈరోజు అలా అనిపించింది. అందుకే వైసీపీ విలీనం అయిపోబోతోందని అనేశాడు! ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. మూడేళ్లలో మూడున్నప్పుడల్లా వైసీపీని బీజేపీలోకి విలీనం చేస్తుంటాడు ఆ నడమంత్రపు మీడియా మోతుబరి. ఇప్పటికే బీజేపీలోకి విలీనం కాబోతుందని చెప్పిన ఈ కామెంటరేటర్.. తాజాగా మరోసారి ఆ ఊసు చెప్పుకొచ్చాడు. మరి ఏమైనా కలొచ్చిందా? అని ఎవరైనా అడుగుతారని అనుకున్నాడో ఏమోకానీ, వైసీపీ వర్గాలే తనకు సమాచారం అందించాయని కూడా ముక్తాయింపునిచ్చారు ఈ ఓపెన్ హార్ట్ సర్జన్.

జగన్ అంటే పడదు.. ఏదో విధంగా డీ ఫేమ్ చేయడమే పని.. మరి ఆ పని చేయడంలో కూడా కాస్తంత పాయింట్ ఏమైనా ఉంటే వినడానికి అయినా ఇంపుగా ఉంటుంది. మరీ కమేడియన్లలా తయారవుతున్నారేంటి బాసు! తన బైలైన్ పెట్టుకుని... పై పెచ్చూ ఫొటో కూడా పెట్టుకునే ఆర్టికల్స్ లో కూడా ఇలాంటి కామెడీలు చేసే జర్నలిస్టులు ఉండటం.. మిగతా జర్నలిస్టులకు కూడా ఒక పెద్ద విచిత్రం.

బైలైన్ ఆర్టికల్స్ రాసేటప్పుడు జర్నలిస్టు అనేవారెవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకంటే.. ఆర్టికల్స్ తప్పులు ఉన్నా, మిస్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, అభాసుపాలయ్యే వాదన ఉన్నా... తను పేరుతో నవ్వుల పాలు అవుతాననే భయం ఏ జర్నలిస్టుకైనా ఉంటుంది. బైలెన్ పెట్టుకుని తను రాసే మాట నిజం కాకపోతే, విడ్డూరంగా అనిపిస్తే జనాలు ఆపై తన రాతలను నమ్మడం మానేస్తారు. విచిత్రమైన విశ్లేషణ చేస్తే.. అది నమ్మశక్యంగా అనిపించకపోతే.. జనాలు నవ్వుకుంటారు. వీడింతేనా.. అనుకుంటారు, అందుకే.. మిగతా సమయాల్లో ఎలా రాసినా, ఏం రాసినా బైలెన్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుంటారు జర్నలిస్టులు. అయితే.. ఆ ఓపెన్ హార్ట్ సర్జన్ కు మాత్రం అలాంటి మొహమాటం ఏమీలేదు.

నవ్వుకుంటే.. నవ్వుకుంటారు. నమ్మశక్యం అనిపించకపోతే.. తనను ఆపై నమ్మరు! అయినా... ఆయన చేసేది జర్నలిజమైతే కాదు కదా! అదో కామెడీ. యూపీలో బీజేపీ విజయం సాధించే సరికి... తాము జాకీలేసే వ్యక్తి పప్పులు ఇక ఉడకవని అర్థమై.. బీజేపీపై ద్వేషం పెరిగింది. పనిలో పనిగా.. వైసీపీని కూడా బీజేపీలోకి విలీనం చేసేసి.. ప్రాప్తి పొందినట్టుగా ఉన్నాడు. ఇలాంటి కామెడీలు కొత్తేమీ కాదు కదా!

Show comments