తన అంద చందాలతోనూ, నటనతోనే కాదు, తనదైన గాత్రంతోనూ తెలుగు ప్రేక్షుల్ని అలరించింది మలయాళ బ్యూటీ మమతా మోహన్‌దాస్. తెలుగులో 'యమదొంగ' తదితర చిత్రాల్లో నటించిన మమతా మోహన్‌దాస్, కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది. నాగార్జునతో 'కేడీ' సినిమాలో నటించే సమయంలో ఆమె క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ సమయంలో నాగ్ ఇచ్చిన మోరల్ సపోర్ట్ గురించి మమతా మోహన్‌దాస్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ఇక, ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ ఏం చేస్తోంది.? అంటే, ఆమె అమెరికాలో వైద్య చికిత్స పొందుతోంది. క్యాన్సర్ నుంచి ఒకటికి రెండు సార్లు ఆమె బయటపడింది. కానీ, మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ ఆమెను వేధిస్తోందట. అయితే, క్యాన్సర్ నుంచి ఆమె కోలుకుందనీ, రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వైద్య చికిత్స అవసరం కావడంతో, ఆమె అప్పుడప్పుడూ అమెరికా వెళ్ళి వైద్య చికిత్స పొందుతోందనీ తెలుస్తోంది.
క్యాన్సర్ సంగతలా వుంచితే, ఆమె సినిమాల్లో నటించడం మాత్రం మానేయలేదు. మలయాళ సినిమాల్లో నటిస్తూనే వుంది. క్యాన్సర్‌తో పోరులో తనదే విజయమంటోంది మమతా మోహన్‌దాస్. ఈ క్రమంలో తనకు చాలామంది అండగా నిలిచారనీ, క్యాన్సర్‌ని ఆత్మవిశ్వాసంతో జయించవ్చనీ మమతా మోహన్‌దాస్ చెబుతోంది.