హెబ్బాతో నాకు చాలా కంఫర్ట్ గా ఉంది

వరుసగా ఆమెతో మూడు సినిమాలు చేసిన రాజ్ తరుణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. హెబ్బా పటేల్ తో నటించడానికి తనకు చాలా సౌకర్యంగా ఉంటుందని, ఏ విషయంలోనైనా హెబ్బా పటేల్ తనకు పూర్తి సహకారం అందిస్తుందని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో. అందుకే హెబ్బాతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడట.

కుమారి 21-ఎఫ్ తో వీళ్లిద్దరూ కలిశారు. తర్వాత ఆడోరకం-ఈడోరకం సినిమాలో కలిసి నటించారు. లేటెస్ట్ గా అంధగాడు సినిమాలో కూడా ఈ జోడీనే రిపీట్ అయింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. హెబ్బా తనకు బోర్ కొట్టదని, చాలా కంఫర్ట్ గా ఉంటుందని అంటున్నాడు రాజ్ తరుణ్.

ఇలా స్టేట్ మెంట్స్ ఇచ్చి లేనిపోని పుకార్లకు ఊతం ఇస్తున్నాడు రాజ్ తరుణ్. మొన్నటికిమొన్న ఓ యాంకర్ విషయంలో రాజ్ తరుణ్ పేరు ప్రముఖంగా వినిపించింది. హెబ్బాతో రిలేషన్ షిప్ అంటూ చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమె గురించి రాజ్ తరుణ్ ఇలా మాట్లాడ్డం అందర్నీ ఆలోచనలో పడేసింది. హెబ్బాతో మరో 30 సినిమాలు చేయాలనుందని రాజ్ తరుణ్ చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

Show comments