కాజల్ తో జోడీకి అభిమానులే అడ్డంకి?

చిరంజీవి 150 వ సినిమా హీరోయిన్ వ్యవహారం అక్కడిక్కడే గుండ్రంగా తిరుగుతూంది. వాస్తవానికి వారం పది రోజుల క్రితం కాజల్ ను కధానాయికగా ఫిక్సయిపోయారు. ఆమె కూడా రెండు కోట్లు పారితోషికం ఓకె అని చెప్పేసారు. కానీ కోటిన్నర నుంచి బేరం ప్రారంభమై కోటి ఎనభై దగ్గర ఆగింది అని వినికిడి. కానీ ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. ఈ విషయమై ఫీడ్ బ్యాక్ తీసుకుంటే కాస్త ఇబ్బంది కలిగిందట.

చరణ్ తో మంచి సినిమాలు చేయడమే కాదు, వాళ్లిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదురుతుంది అనిపించుకుంది కాజల్. అలాగే బన్నీతో నటించింది. పవన్ తో కూడా. ఇలా తన కొడుకు, మేనల్లుడు, తమ్ముడు సరసన నటించిన కాజల్ తో చిరు నటించడం అంత బాగుండదని ఫ్యాన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దాంతో చిరు డిస్సపాయింట్ అయ్యారని, మళ్లీ ఇదే విషయమై జనంలో ఓ నెగిటివ్ థాట్ రాకుండానే ముందుగానే ఆ కాంబినేషన్ లేదని వార్తలు మీడియాలోకి పంపేసారని తెలుస్తోంది.

డబ్బుల దగ్గర కాస్త రాజీ పడినా కూడా పాపం, చిరుకు హీరోయిన్ దొరకలేదు. ట్విస్ట్ ఏమిటంటే ఇప్పటికీ కాజల్ తో చేయాలనే వుందని మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాల బోగట్టా.

Readmore!
Show comments