నయనతార ఎందుకు వదిలేసిందంటే...

చిరంజీవి హీరోగా నటించే సినిమాకి హీరోయిన్‌ ఎవరన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే వుంది. సినిమా షూటింగ్‌ మాత్రం షురూ అయిపోయింది.. శరవేగంగా సినిమా షూటింగ్‌ జరుగుతోందని నిర్మాత రామ్‌చరణ్‌ ప్రకటించేశాడు కూడా. మరి హీరోయిన్‌ ఎవరు.? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడంలేదు. 

ఓ ప్రముఖ హీరోయిన్‌, చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని కాదనేసుకుందని చాన్నాళ్ళుగా గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆ హీరోయిన్‌ ఎవరు.? అంటే నయనతార అన్న పేరు తెరపైకొచ్చింది. ముందుగా అనుష్క, చిరంజీవితో నటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని టాలీవుడ్‌లో ప్రచారం జరిగిన విషయం విదితమే. అయితే, అనుష్క కాదు.. నయనతారే చిరంజీవితో సినిమా చెయ్యననేసిందంటూ టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. రెమ్యునరేషన్‌ దగ్గరే నయనతార, మెగా ఆఫర్‌ని వద్దనేసుకుందట. 

ఇక, తెలుగులో నయనతార చేస్తోన్న తాజా చిత్రం 'బాబు బంగారం' విషయంలోనూ నయనతార ఇబ్బందుల్ని క్రియేట్‌ చేస్తోందనే వాదన తెరపైకొచ్చింది. షూటింగ్‌ సమయంలోనే నయనతార చాలా ఇబ్బంది పెట్టేసిందనీ, ప్రమోషన్‌ విషయంలోనూ నయనతార మొహం చాటేస్తోందనీ ప్రచారం జరుగుతోంది. తమిళ సినిమాలకు మాత్రం నయనతార బాగానే సహాయ సహకారాలు అందిస్తుండడం గమనార్హం.

Show comments