'లుక్‌'తో ఆటాడేసుకున్నాడా.?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో డాన్సులతో ఆకట్టుకున్నది సుశాంత్‌ మాత్రమే. అఫ్‌కోర్స్‌, అక్కినేని అఖిల్‌ ఆ తర్వాత డాన్సులతో దుమ్మురేపేశాడనుకోండి.. అది వేరే విషయం. సుశాంత్‌ విషయానికొస్తే, 'కాళిదాసు' సినిమాతో తెరంగేట్రం చేసి, 'కరెంట్‌' అనీ, ఇంకోటనీ సినిమాలైతే చేశాడుగానీ సరైన సక్సెస్‌ మాత్రం అందుకోలేకపోయాడు. 

తాజాగా ఆటాడుకుందాం రమ్మంటున్నాడు సుశాంత్‌. 'ఆటాడుకుందాం రా' సినిమాతో ఆగస్ట్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సుశాంత్‌, ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టేస్తానంటున్నాడు. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 'జస్ట్‌ చిల్‌' క్యాప్షన్‌తో, 'ఆటాడుకుందాం రా' టైటిల్‌తో సుశాంత్‌ లేటెస్ట్‌ లుక్‌ని బయటకు తీసుకొచ్చారు. కానీ ఏం లాభం.? లుక్‌తోనే కుర్రాడు సరైన మార్కులు సంపాదించుకోలేకపోయాడన్నది టాలీవుడ్‌లో విన్పిస్తోన్న మాట. 

కామెడీ చేశాడు, యాక్షన్‌ చేశాడు, రొమాన్స్‌ ట్రై చేశాడు.. ఏం చేసినా, సక్సెస్‌ మాత్రం సుశాంత్‌కి మొహం చాటేసేసింది. మరి ఆ లోటుని 'ఆటాడుకుందాం రా' సినిమాతో తీర్చుతాడా.? వేచి చూడాల్సిందే.

Show comments