ఇలాంటి హీరోయిన్ ను మళ్లీ ప్రోత్సహిద్దామా?

టాలీవుడ్ సినిమాల్లో నటించిన నార్త్ అమ్మాయిలు ఎప్పటికప్పుడు తమ బుద్ధిని బయటపెడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న తెలుగు సినీ పరిశ్రమను అనరాని మటలంది ఇలియానా. ఇప్పుడు తానేం తక్కువ తినలేదని నిరూపించుకుంటోంది తాప్సి.

నిన్నటివరకు తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడిన ఈ హీరోయిన్.. బాలీవుడ్ లో క్రేజ్ వచ్చిన వెంటనే తెలుగు సినిమాలపై సెటైర్లు స్టార్ట్ చేసింది. లెజెండరీ దర్శకుడిపై జోకులేసే స్థాయికి ఎదిగింది.

ఓ వెబ్ సిరీస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సి, తెలుగు దర్శకులకు నడుమంటే ఎందుకు అంత పిచ్చో అర్థం కావడం లేదని సెటైర్లు వేసింది. రాఘవేంద్రరావు పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. అప్పటికే శతాధిక చిత్రాలు చేసిన ఒక దర్శకుడు తనను టాలీవుడ్ కు పరిచయం చేశాడని.. శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లకు స్టార్ డమ్ ఇచ్చిన ఆ దర్శకుడు హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు వేశాడని.. తన బొడ్డుపై మాత్రం కొబ్బరికాయ పెట్టాడని వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడింది. తన బొడ్డు అంటే ఎందుకంత పిచ్చో అర్థం కావట్లేదని చెప్పింది.

ఇక్కడితో ఆగకుండా తాప్సి నటించిన తొలి తెలుగు సినిమా ఝుమ్మంది నాదంలోంచి కొన్ని సాంగ్ క్లిప్స్ ను అక్కడికక్కడ ప్రసారం చేశారు. ఆ క్లిప్స్ చూసి తాప్సి, ప్రేక్షకులు ఒకటే నవ్వు. టాలీవుడ్ మేకర్స్ అంతా చేతకానివాళ్లు అన్నట్టు తాప్సితో పాటు అక్కడి యాంకర్ల చేష్టలు. Readmore!

తెలుగు సినీరంగానికి కమర్షియల్ టచ్ ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. మరెంతో మంది హీరోలు, హీరోయిన్లను స్టార్స్ గా తీర్చిదిద్దారు.

అలాంటి దర్శకుడి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. రాఘవేంద్రరావు గురించి, అతని టేకింగ్, ఫిలిం మేకింగ్ ఎంత బాగుంటుందో స్వయంగా తాప్సి అప్పట్లో పొగిడింది.

బాలీవుడ్ లో ఏవో 2 సినిమాలతో గుర్తింపు వచ్చిన వెంటనే బ్రేక్ ఇచ్చిన ఇక్కడి వ్యక్తుల్ని మరిచిపోయింది. మరిచిపోయినా ఫర్వాలేదు. వాళ్ల గురించి నలుగురిలో కించపరిచేలా మాట్లాడ్డం తప్పు. అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఆనందో బ్రహ్మ అనే మరో తెలుగు సినిమా చేసింది.

ఏరుదాటాక తెప్ప తగలేసే ఇలాంటి హీరోయిన్లను, ఇక్కడ హీరోయిన్లుగా ఎదిగి మన వాళ్లపైనే సెటైర్లు వేసే ఇలాంటి బుద్ధితక్కువ భామలను ఇంకోసారి ప్రోత్సహిద్దామా..? మళ్లీ మళ్లీ అవకాశాలు ఇద్దామా..? పరిశ్రమ నుంచి వెలివేయడమే ఇలాంటివాళ్లకు సరైన శిక్ష.

Show comments