జగన్ పేరుతో శిల్పా మోహన్ రెడ్డి రాజకీయం..?

అవకాశ వాదానికి ఈ రోజుల్లో హద్దంటూ ఏమీ లేదు. అంతా బహిరంగంగా ప్రదర్శించేయడమే.. తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ దొరకకపోతే వైసీపీలోకి చేరతా, ఆ పార్టీ తరపున గెలిచినా.. అధికారం టీడీపీ చేతిలో ఉంది కాబట్టి.. ఇటువైపు వచ్చేస్తా.. ఇదీ నేతలుగా చలామణి అవుతున్న హీనుల తీరు. సిగ్గుశరం వదిలి ఒక పార్టీ తరపున గెలిచి, ప్రజల ఓట్లను ఒక పార్టీ తరపున పొంది.. మరో పార్టీ లో చేరిన వారు బరితెగించచి వ్యవహరిస్తున్నారు.

మరి వాళ్ల కథ అలా ఉంటే.. నంద్యాల నేత శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ పేరును ఫుల్ గా వాడేసుకున్నాడని తెలుస్తోంది. తనకు నంద్యాల టికెట్ ఇవ్వకపోతే వైకాపాలో చేరిపోతాను అనేది శిల్పా మోహన్ రెడ్డి చేస్తున్న తొలి హెచ్చరిక. అది మాత్రమే గాక.. ఈయన మీడియాకు మరికొన్ని లీకులు వదులుతున్నాడు. తను జగన్ ను కలిశాననే లీకును కూడా ఇస్తున్నాడు.

బెంగళూరులో జగన్ ను కలిశానని ఒకసారి, కాదు పులివెందల వెళ్లి జగన్ ను కలిశానని మరికొన్ని మీడియా వర్గాలకు శిల్పా మోహన్ రెడ్డి లీకులు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. తను వైకాపాలోకి వెళితే అక్కడ టికెట్ ఖరారు అనేది శిల్పా మోహన్ రెడ్డి చెబుతున్న మాట.

మరి ఇది నిజంగానే నిజమేనా.. అని ఆరా తీస్తే.. అంత సీన్ లేదన్నట్టుగా తెలుస్తోంది. కేవలం చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేసేందుకే శిల్పా మోహన్ రెడ్డి ఈ రాజకీయం చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. కేవలం చంద్రబాబును హెచ్చరించడానికి శిల్పా ఈ లీకులిస్తున్నట్టుగా సమాచారం. జగన్ ను కలిశాను అని హెచ్చరిస్తే చంద్రబాబులో కదలిక వస్తుందనేది శిల్పా ఆశ.

Readmore!

అయితే నంద్యాల టికెట్ లేకపోతే.. కనీసం ఎమ్మెల్సీ పదవి హామీ.. ఇదీ శిల్పా మోహన్ రెడ్డి కోరిక. వీటిలో ఏదో ఒకటైనా సాధించుకోవాలిప్పుడు అనేది శిల్పా లక్ష్యం. అందుకు అనుగుణంగానే జగన్ పేరును వాడుకొంటూ రాజకీయం చేస్తున్నట్టుగా ఉన్నాడు. వీటిల్లో ఏదో ఒకదానికి చంద్రబాబు హామీ ఇస్తే.. అప్పుడు ‘అబ్బే.. జగన్ ను నేనెప్పుడు కలిశాను, ఎందుకు కలుస్తాను?’ అనగలగడం ఇలాంటోళ్లకు వెన్నతో పెట్టిన విద్య కదా!

Show comments

Related Stories :