సినిమా ఓపెనింగ్.. యూట్యూబ్ లో లైవ్

మొన్నటికి మొన్న బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇప్పుడు రామ్ కూడా అదే పని చేయబోతున్నాడు. తన కొత్త సినిమా ఓపెనింగ్ ను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాడు. ఓ తెలుగు సినిమా ప్రారంభోత్సవాన్ని యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. 

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరోసారి నటించేందుకు రెడీ అవుతున్నాడు రామ్. ఉగాదికి వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. ఆ ముహూర్తం షాట్ ను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత.. రామ్ ను లైవ్ లో కూర్చోబెట్టి మరో లైవ్ ప్రోగ్రామ్ కూడా చేయాలని అనుకుంటున్నారు. సినిమా ఓపెనింగ్ తర్వాత అభిమానులతో రామ్ నేరుగా మాట్లాడతాడట. 

అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా ఎంపికైన ఈ సినిమా కోసం రామ్ చాలానే మేకోవర్ అయ్యాడు. కండలు పెంచడంతో పాటు ఫుల్ గా గడ్డం కూడా పెంచాడు. రామ్ నయా లుక్ ను ఓపెనింగ్ రోజున చూడొచ్చు. మార్చి 29 ఉదయం 10 గంటల 25 నిమిషాలకు రామ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.

Show comments