సెన్సార్ కూడా సీక్రెట్ గా ఉంచాలా...?

బాహుబలి-2 సినిమా సెన్సార్ కు వెళ్లిందనే వార్త బయటకొచ్చినప్పటి నుంచి అంతా ఎదురుచూశారు. స్టోరీ రివీల్ అవుతుందని కొందరు, సెన్సార్ రిపోర్ట్ కోసం మరికొందరు, ఫస్ట్ టాక్ కోసం ఇంకొందరు వెయిట్ చేశారు. కానీ ఇవేవీ జరగలేదు. సోమవారం బాహుబలి-2 సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. కానీ ఒక్కటంటే ఒక్క న్యూస్ కూడా బయటకు రాలేదు.

సెన్సార్ ను కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సార్ మేటర్ ను కూడా చీప్ గా పబ్లిసిటీకి వాడుకుంటున్నారని కామెంట్స్ చేశారు కొందరు. కానీ ఇక్కడ విషయం వేరు.

ప్రస్తుతం ఎడతెగని ప్రమోషన్ తో బిజీగా ఉంది బాహుబలి టీం. ఎంత తొందరగా సెన్సార్ కంప్లీట్ అయితే, అంత తొందరగా ప్రింట్స్ ను ఓవర్సీస్ కు డిశ్పాచ్ చేయాలనే ఆలోచనలో ఉంది. పైగా, ఇప్పటివరకు కేవలం తెలుగులో మాత్రమే సెన్సార్ పూర్తయింది. తమిళ, హిందీ భాషల్లో కూడా సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత ఆ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్. తాజా సమాచారం ప్రకారం.. బాహుబలి-2 తెలుగు వెర్షన్ కు U/A సర్టిఫికేట్ దక్కింది.

Readmore!
Show comments

Related Stories :