మెగా హీరో ఫ్యూచర్‌ వినాయక్‌ చేతిలో

ఇప్పటికే పాతిక కోట్ల మార్కెట్‌ని సంపాదించుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ఇక నెక్స్‌ట్‌ లెవల్‌పై దృష్టి పెట్టాడు. ఏ లిస్ట్‌ డైరెక్టర్లతో పని చేస్తే తప్ప మార్కెట్‌ బూస్ట్‌ అవడం ఈజీ కాదు కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే వినాయక్‌ దర్శకత్వంలో తేజ్‌ నటిస్తాడనే ప్రచారం బాగా జరుగుతోంది. 

సోర్సెస్‌ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం అది నిజమేనని తెలిసింది. 'ఖైదీ నంబర్‌ 150' కంటే ముందు వినాయక్‌ రెడీ చేసుకున్న స్క్రిప్ట్‌ ఒకటి తేజ్‌కి అనుగుణంగా మారుస్తున్నారట. వేరే సినిమాలకి కమిట్‌ అయిన తేజ్‌ వాటిని కొంతకాలం వెనక్కి జరిపి మరీ వినాయక్‌ చిత్రాన్ని చేయబోతున్నాడట. 

వినాయక్‌తో వర్క్‌ చేస్తే మాస్‌లోకి చొచ్చుకుపోయే అవకాశాలు మెరుగవుతాయని తేజ్‌ నమ్ముతున్నాడు. కనీసం నలభై కోట్ల రేంజ్‌కి ఎదగవచ్చునని, అక్కడ్నుంచి వేరే స్టార్‌ డైరెక్టర్లతో వర్క్‌ చేసి స్టార్‌గా సెటిల్‌ అవ్వవచ్చునని చూస్తున్నాడు. కమర్షియల్‌ చిత్రాల నుంచి బ్రేక్‌ కోసం జవాన్‌ చేస్తున్నా, మాస్‌ని మెప్పించే ప్రయత్నాలైతే మానుకోవడం లేదు.

Readmore!
Show comments