ధోనీ ఫస్ట్ లవర్.. మరణించిందా..?

మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ప్రేమ కథ ఏంటి? ఈ టీమిండియా కెప్టెన్ మొదటి ప్రేమ లో చాలా ట్రాజెడీ ఉందా? ధోనీ బయోపిక్ లో అతడి లవ్ స్టోరీ ప్రస్తావన కూడా ఉంటుంది, వివాహానికి పూర్వం అతడి ప్రేమ జీవితానికి సంబంధించిన వివరాలు ఉంటాయని అంటుంటే, అదేదో సరదా స్టోరీ అనుకున్నారంతా. అయితే.. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ధోనీ ప్రేమ కథకు సంబంధించిన సీన్లను నటించినప్పుడు తన గుండె భారమైందని చెప్పాడు.

ఏదో కథగా కాకుండా, ఒక వ్యక్తి జీవితంలోని బాధను చిత్రీకరిస్తున్నాం.. అనే స్పృహ కలిగినప్పుడు మనసంతా వికలం అయ్యిందని సుశాంత్ వివరించాడు.

ధోనీ 20 యేళ్ల వయసులో ఉన్నప్పటి ప్రేమ కథ అది అని తెలుస్తోంది. ఆమె పేరు ప్రియాంక ఝా అని సమాచారం. ఒకవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ, జాతీయ జట్టులో స్థానం కోసం ధోనీ ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆమె పరిచయం అయ్యిందని తెలుస్తోంది. ధోనీ ఎదుగుతున్న దశలో ఒక రోడ్ యాక్సిడెంట్ లో ప్రియాంక మరణించిందని తెలుస్తోంది.

మరి ధోనీ బయోపిక్ అంటే, ఇందులో క్రికెట్, గ్లామర్, అన్ని బయోపిక్స్ లో ఉండే ‘ఎదిగే కష్టం’ మాత్రమే కాదు.. హృదయాలను భారంగా మార్చే భావోద్వేగాలు కూడా ఉన్నాయని అనుకోవాల్సి వస్తోంది. వాటన్నింటినీ జయించి వచ్చిన ధోనీ నిజంగా గ్రేట్ కదా!

Show comments