చిరు సినిమా వెనుక తమ్ముడు

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తెర వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారా? సలహాలు సూచనలు అన్నీ అక్కడి నుంచే అందుతున్నాయా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరంజీవికి తెరవెనుక నుంచి 150 వ సినిమాకు సంబంధించి అన్ని సలహాలు అందిస్తున్నది పవన్ కళ్యాణ్ నే నట. ఆయన సూచనల మేరకే కీలక నిర్ణయాలు అన్నీ డిసైడ్ అయ్యాయని వినికిడి.

బేసిక్ గా 150వ సినిమాకు కత్తి సినిమాను రీమేక్ చేయాలన్న సూచనే పవన్ దగ్గర నుంచి వెళ్లిందట. ఈ సినిమా ముందుగా పవన్ దగ్గరకే వెళ్లిన సంగతి తెలిసిందే. రైతు సమస్యలు, మెసేజ్ ఇలాంటివన్నీ తెలిసి, పవన్ ఈ సినిమా గురించి అన్నకు చెప్పి, డిసైడ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. 

కీలకమైన పాత్రకు సునీల్ డేట్ల దొరకపుడు, వెన్నెల కిషోర్ పేరు వినవస్తున్న తరుణంలో ఆలీ పేరు సూచించింది కూడా పవనే నని టాక్. ఆలీ-పవన్ ల స్నేహ బంధం తెలిసిందే.  ఆ తరువాత పొలికటికల్ గా, హార్ట్ టచింగ్ గా సరైన డైలాగులు పడడం లేదని తెలిసి బుర్రా సాయి మాధవ్ ను సూచించింది కూడా పవన్ నే అట. 

గోపాల గోపాల దగ్గర నుంచి సాయి మాధవ్ ను పవన్ దగ్గరకు తీసిన సంగతీ విదితమే. ఇక లేటెస్ట్ గా కాజల్ ను సూచించింది కూడా పవన్ నే అట. నిజానికి కోటి ఎనభై లక్షలు అని సినిమా యూనిట్ ముందు వెనుకలాడుతుంటే, ప్రోసీడ్ అని ముందుకు తోసింది పవన్ నే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాజల్ తో పవన్ సర్దార్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.  Readmore!

ఇలా ప్రతి కీలకమైన విషయంలోనూ పవన్ ఇన్ వాల్వ్ మెంట్ వుంటోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.     

Show comments

Related Stories :