కాదంబరి ఇంటి నెంబర్ 150

ఓ హిట్ ప్రొడక్ట్ మార్కెట్ లోకి వస్తుంది అనుకుంటే, దాని ఇమేజ్ ను క్యాష్ చేసుకునే ప్రొడక్ట్ ఆ వెంటనే వచ్చేస్తుంది. టాలీవుడ్ లో ఓ టైటిల్ క్లిక్ అయితే ఆ వరసలో అలాంటి టైటిళ్లు చాలా వస్తాయి. ఖైదీ నెంబర్ 150 టైటిల్ బాగుందని మరి కొన్ని అలాంటి టైటిళ్లు పుట్టుకు వస్తున్నాయి. అయితే  ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ముందుగా వచ్చేస్తోంది. 

కాదంబరి ఇంటి నెంబర్ 150 అనే పేరుతో ఓ డబ్బింగ్ సినిమా రాబోతోంది. తమిళ హర్రర్ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఇది. హీరోయిన్ పేరు కాదంబరి, ఆమె ఇంటి నెంబర్ 150 కావడంతో ఈ టైటిల్ ఫిక్స్ చేసారు, తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా టైటిల్ డిజైన్ కూడా అచ్చం ఖైదీ నెంబర్ 150 మాదిరిగానే తయారుచేసారు. ఈ సినిమా నవంబర్ లోనే థియేటర్లలోకి వచ్చేస్తుందట.

Show comments