ఏలూరులో జనసేన హల్ చల్

ఇలా పవన్ ఓ మాట అన్నారో లేదో, అలా ఏలూరులో జనసేన సందడి మొదలైపోయింది. జస్ట్ తనను కలసిన అభిమానులతో పవన్ ఓ మాట చెప్పారు అంటూ బయటకువచ్చింది. తన ఓటు వెస్ట్ గోదావరిలో నమోదు చేసుకుంటా అని, ఏలూరులో ఇల్లు చూడమని. అంతే ఏలూరులో జనసేన కార్యకర్తలు హల్ చల్ చేసారు. రోడ్లపైకి గుంపులుగా వచ్చి బాణాసంచా కాల్చారు. 

అసలే వెస్ట్ గోదావరిలో ఆక్వా సమస్య నడుస్తోంది. దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పవన్ ప్రకటించారు కానీ, ఉద్యమంలోకి ఆయన దిగలేదు. దిగుతారని అనుకోవడానికీ లేదు. ఇప్పుడు దానికి తోడు తన రాజకీయ కార్యక్షేత్రంగా పవన్ ఏలూరును ఎంచుకోవడం చూస్తుంటే, ఇక వెస్ట్ గోదావరిలో జనసేన హడావుడి మొదలయ్యేలాగే వుంది. 

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఫుల్ స్వీప్ చేసింది. మరి ఇప్పుడు జనసేన ఆ ఫుల్ కేక్ లో తమకు వాటా కావాలని ముందుకు వచ్చేలా వుంది పరిస్థితి చూస్తుంటే.

Show comments