అయినా డోన్ట్‌ కేర్‌: రాధికా ఆప్టే

రాధికా ఆప్టే న్యూడ్‌ సీన్లు ఇప్పుడు సీడీల రూపంలో లభ్యమవుతున్నాయి. 'పర్చేద్‌' సినిమా కోసం రాధికా ఆప్టే న్యూడ్‌గా నటించిన విషయం విదితమే. వాస్తవానికి ఆ న్యూడ్‌ సీన్లను ఇండియాలో విడుదల చెయ్యాలనుకోలేదు. విదేశాల్లో, అదీ సినీ ఉత్సవాల కోసం ఆ సన్నివేశాలతో కూడిన సినిమాని 'ప్లే' చేశారు. ఒక్కసారి 'మార్కెట్‌'లోకి వచ్చాక, దాన్ని అదుపు చేయడం కష్టం. 

ఎలా లీకయ్యిందో తెలియదు, ఇండియాలోనూ ఈ సినిమా యధాతథంగా అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా సోషల్‌ మీడియాకి ఎక్కింది. ఆ తర్వాత, సీడీల రూపంలోకి మారింది. అంతే, 'ఫుల్‌ క్లారిటీ..', 'హెచ్‌డీ' పేర్లతో రాధికా ఆప్టే సీన్లకు తోడు, కొన్ని బ్లూ ఫిలింలలోని సన్నివేశాల్నీ కలిపి సీడీలు దంచేస్తున్నారు. 

మార్ఫింగ్‌ టెక్నాలజీ ఎటూ అందుబాటులో వుంది కదా. దాన్ని జోడించి, ఇంకా హాట్‌గా 'పర్చేద్‌' సీన్లను మిక్స్‌ చేసేసి సీడీల్ని 30 నుంచి 300 రూపాయల వరకూ అమ్మేస్తుండడంతో ఓ దశలో రాధికా ఆప్టే షాక్‌కి గురయ్యింది. అయితే, ఈ వ్యవహారంలో డైరెక్ట్‌గా పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. దాంతో నిర్మాతల సహకారం కోరింది రాధికా ఆప్టే. కానీ, జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. 

ఇంకోపక్క, ఈ వ్యవహారంపై ఆల్రెడీ స్పందించిన రాధికా ఆప్టే, తాజాగా ఓ సందర్భంలో 'ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి నేనేం చెయ్యాలో, చెయ్యగలనో చేశాను. నటిగా నా బాధ్యత నిర్వహించాను, పూర్తి స్పృహతో చేశాను..' అంటూ వివరణ ఇచ్చింది. చీప్‌గా సీడీలు చేసి అమ్మేయడంపై స్పందిస్తూ, 'ఇంత చిన్న బుద్ధి ప్రదిర్శించడం శోచనీయం' అని మాత్రం వ్యాఖ్యానించి ఊరుకుంది.

Show comments