బన్నీ చూపు కైరా అద్వానీ వైపు

స్టయిలిష్ స్టార్ బన్నీ చూపు ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ వైపు మళ్లింది. త్వరలో ప్రారంభించపోయే సినిమా కోసం హీరోయిన్ గా ఆమె ఓకె అంటుందా? డేట్లు అడ్డస్ట్ అవుతాయో చూడమని బన్నీ చెప్పేసాడు. ఎమ్ ఎస్ ధోని చిత్రం ద్వారా కైరా అందరికీ పరిచయమే. ఒక వేళ కైరా డేట్లు కనుక అడ్జస్ట్ కాకపోతే, ఆల్టర్నేటివ్ గా మరో పేరు కూడా బన్నీనే చెప్పేసాడు. 

అదేవరో కాదు.  వరుణ్ తేజ తో లోఫర్ సినిమాలో ఆడిపాడిన అమ్మాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ సౌత్ కు తీసుకువచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయి సూపర్ బిజీ.

అయితే కైరా అద్వానీ లేకపోతే దిశాపటానీ అనే టార్గెట్ తో బన్నీ యూనిట్ ఇప్పుడు డేట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. లగడపాటి శ్రీధర్ నిర్మించే ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడు. వక్కంతం వంశీ దర్శకుడు.

Show comments