బాహుబలి నటీనటుల్లో నంబర్ వన్ ఎవరో తెలుసా..?

ఈ ప్రశ్నకు పెద్దగా ఎవరూ ఆలోచించరు. ఆటోమేటిగ్గా ప్రభాస్ పేరు బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అతడు హీరో. ఇంకొంతమంది చెబితే రానా పేరు చెప్పొచ్చు. లేదంటే రమ్యకృష్ణ పేరు చెప్పొచ్చు. ఇదే ప్రశ్న రాజమౌళిని అడిగితే ఎవరి పేరు చెబుతాడు.? ఆ ప్రశ్న రాజమౌళికి ఎదురైంది.. సమాధానం కూడా దిమ్మతిరిగే లెవెల్లోనే ఉంది.

బాహుబలి మొత్తం క్రూలో నటన పరంగా నంబర్ వన్ స్థానాన్ని నాజర్ కు ఇచ్చాడు రాజమౌళి. ఇది ఎవరూ ఊహించని సమాధానమే. కానీ తను చూసిన నటుల్లో నాజర్ ను మించినోళ్లు లేరనేది రాజమౌళి వెర్షన్.

మరీ ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజీలో బిజ్జలదేవ పాత్ర నిడివి, బరువు తక్కువే అయినప్పటికీ.. అండర్ కరెంట్ గా ఆ పాత్ర లేకపోతే బాహుబలి ప్రాజెక్టే లేదంటున్నాడు రాజమౌళి. అందుకే నంబర్ వన్ స్థానం అతడికే ఇచ్చాడు.

రెండో స్థానంలో కూడా ప్రభాస్ పేరు చెప్పలేదు జక్కన్న. సెకెండ్ ప్లేస్ ను జాయింట్ గా రానా-అనుష్కకు ఇచ్చాడు. ఇప్పటివరకు వీళ్లకు తమలోని నటనను వెలికితీసే సినిమాలు పడలేదని, బాహుబలితో వాళ్లలోని యాక్టింగ్ టాలెంట్ రెట్టింపు అయిందంటున్నాడు రాజమౌళి. అందుకే రెండో స్థానం వాళ్లిద్దరికీ ఇచ్చాడు.

సో.. పర్ఫార్మెన్స్ పరంగా మూడో స్థానంలో ప్రభాస్, రమ్యకృష్ణ, సత్యరాజ్ ఉంటారని మనం అర్థంచేసుకోవాలి. మొన్నటివరకు ప్రభాస్ లేకపోతే బాహుబలి ప్రాజెక్టు లేదని తెగ మెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు ఏకంగా అతడు నంబర్ వన్ కాదంటున్నాడు.

Show comments