పవన్ చాలా తెలివైన రాజకీయ నాయకుడిగా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో ఆయనకు ఏమన్నా ఆబ్లిగేషన్లు వుంటే, వాటిని తప్పించుకుంటే. పదే పదే ఆయన ఇటీవల తన భార్య క్రిస్టియన్ అని, తన కుమార్తెకు కూడా ఆ మతం ఇప్పిస్తానంటే, ఓకె అన్నానని చెప్పుకొస్తున్నారు. అసలు ఆ క్రిస్టియన్ భార్యను ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో చెప్పరు. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. కానీ పవన్ పదే పదే ఈ విషయం మాత్రం చెబుతున్నారు. దీని వెనుక పవన్ బలమైన స్ట్రాటజీ వేసారని తెలుస్తోంది.
పవన్ తనకు కులం అంటే ఇష్టం లేదని చెప్పినా కూడా ఆయన బలం కులమే అని అందరికీ తెలిసిందే. ఆయన వద్దన్న మాత్రాన కాపులు ఆయన వెనకాల నిలవడం మానేయరు. ఆ సంగతి ఆయనకు బాగా తెలుసు. కానీ కాపుల ఓట్లు ఒకటే సరిపోవుగా. పైగా జగన్ కు క్రిస్టియన్ ఓట్ల సపోర్టు వుందనే టాక్ వుంది. మరి వాటిని చెదరగొడితే పవన్ కైనా మంచిదే, ఆయనను నమ్ముకున్న బాబుకైనా మంచిదే. అందుకే పవన్ పదే పదే తన భార్య, కుమార్తే క్రిస్టియన్ లు అని చెబుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి పవన్ తనకు కులం ఇష్టం లేదని చెబుతూ, మతం గురించి మాట్లాడ్డం ఏమిటి? కులం వేరు మతం వేరు కదా? నిజానికి పవన్ అలాంటపుడు తన తొలి భార్య కులం ఇది, మలి భార్య కులం అది, ఇప్పుడు మూడో భార్య విదేశీ, ఆమెకు కులమే లేదు అని చెప్పాలి కానీ? మతం గురించి చెప్పడం ఏమిటి? అంటే దీని వెనుక పవన్ స్ట్రాటజీ క్రిస్టియన్ ఓట్ బ్యాంకు కాక మరేమిటి? అనుకోవాలి?